ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణేష్ శోభాయాత్రకు ఏర్పాట్లు చేయండి: మంత్రి తలసాని

ABN, First Publish Date - 2021-09-17T19:49:26+05:30

ఈ నెల 19 వ తేదీన నిర్వహించే గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఈ నెల 19 వ తేదీన నిర్వహించే గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిమజ్జన ఏర్పాట్లకు ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోయాయని పేర్కొన్నారు. శోభాయాత్ర, విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసు, ట్రాపిక్ పోలీసు, జీహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, ఆర్అండ్ బి, ఎలెక్ట్రికల్ తదితర అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. శోభాయాత్ర, నిమజ్జనం పర్యవేక్షణ కోసం వివిధ శాఖల అధికారులతో ఒక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 


విగ్రహాల నిమజ్జనం జరిగే హుస్సేన్ సాగర్ పరిసరాలలో 24 క్రేన్ లతో పాటు జీహెచ్ఎంసి పరిధిలో నిమజ్జనం కోసం గుర్తించిన పలు రిజర్వాయర్ లు, 25 చెరువులు, 25 బేబీ పాండ్స్ వద్ద మొత్తం 300 క్రేన్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 100 మంది గజ ఈతగాళ్ళను కూడా అందుబాటులో ఉచడం జరుగుతుందని వివరించారు. మండపాల నిర్వహకుల విద్యుత్ సరఫరా లో అంతరాయం కలగకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచాలని ఆయన చెప్పారు. అదేవిధంగా నిమజ్జనం కోసం విగ్రహాలను తీసుకెళ్లేందుకు మండపాల నిర్వహకులకు అవసరమైన వివిధ రకాల వాహనాలు వెయ్యి వరకు జీహెచ్ఎంసి పరిధిలోని 10 పాయింట్స్ లలో అందుబాటులో ఉంచడం జరిగిందని, వీటి పర్యవేక్షణ కోసం 30 మంది ఆర్టీఏ అధికారులు, ఇన్స్పెక్టర్ లను ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. 


అదేవిధంగా విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే రహదారులలో అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను, చెట్ల కొమ్మలను తొలగించాలని ఆదేశించారు. ట్రాపిక్ పోలీసు, ఆర్అండ్ బి శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి శోభాయాత్ర కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, వాహనదారులు, భక్తులు ఇబ్బందులకు గురికాకుండా ట్రాపిక్ డైవర్షన్ చేయాలని చెప్పారు. అవసరమైన ప్రాంతాలలో మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాలలో, శోభాయాత్ర నిర్వహించే రహదారులలో ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ జరిగేలా 8,160 మంది సిబ్బందితో శానిటరీ సూపర్ వైజర్ లేదా ఎస్ఎఫ్ఏ ల ఆధ్వర్యంలో 215 ప్రత్యేక బృందాలను నియమించడం జరుగుతుందని పేర్కొన్నారు.


శోభాయాత్ర, నిమజ్జనం  ప్రశాంతంగా నిర్వహించేందుకు 27,955 మంది వివిధ స్థాయిలలోని పోలీసు సిబ్బందితో పాటు గ్రే హ్యాండ్స్, ఆక్టోపస్ దళాలు కూడా బందోబస్తు విధులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం కూడా నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, సంజీవయ్య పార్క్, జేమ్స్ స్ట్రీట్, బేగంపేట రైల్వే స్టేషన్ ల నుండి ప్రత్యేకంగాఎంఎంటీఎస్ రైళ్ళను  నడపనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు, ఉత్సవాల నిర్వహకులు కూడా ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోరారు.

Updated Date - 2021-09-17T19:49:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising