మాకూ తిట్లపురాణం వచ్చు.. కానీ..: మంచిరెడ్డి
ABN, First Publish Date - 2021-08-19T19:47:00+05:30
సీఎం కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఎమ్మెల్యే మంచిరెడ్డి అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమకు కూడా తిట్ల పురాణం వచ్చునని, కానీ సంస్కారం అడ్డొస్తుందన్నారు. రేవంత్ ఖబర్దార్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. విమర్శలు చేయడం కాదని, అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పాలన్నారు. కాంగ్రెస్ సినియర్లే రేవంత్‌ను రాళ్లతో కొట్టి పంపిస్తారని మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు.
Updated Date - 2021-08-19T19:47:00+05:30 IST