ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టార్టప్ సక్సెస్ సూత్రం...టీం వర్క్:ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ABN, First Publish Date - 2021-02-08T23:12:51+05:30

తెలంగాణలో అనేక ప్రభుత్వ పథకాల నగదు మహిళకే అందిస్తూ, ఆర్థిక చేయూతనిస్తున్నామన్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో అనేక ప్రభుత్వ పథకాల నగదు మహిళకే అందిస్తూ, ఆర్థిక చేయూతనిస్తున్నామన్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రతిష్టాత్మక అశోక యూనివర్సిటీ, వీ-హబ్ సంయుక్తంగా నిర్వహించిన వెబినార్ లో ఆమె ప్రసంగించారు.  మహిళ చేతిలో ఆర్థిక నియంత్రణ ఉంటే బాగుంటుందన్నారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా  వెబినార్ లు నిర్వహిస్తున్న అశోకా యూనివర్సిటీ, వీహబ్ లను ఎమ్మెల్సీ కవిత అభినందించారు.


 రాజకీయ నాయకులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇతర దేశాల మాదిరిగా ఇండియాలో సైతం వ్యాపారాలను ప్రోత్సహించేవిధంగా అవినీతి రహిత విధానాలు రూపొందించాలన్న కవిత, ఉన్నత విద్యను సైతం సహకారాలు అందించాలన్నారు. జాతీయ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లాంటి భవిష్యత్ టెక్నాలజీలపై ప్రత్యేక విధానం ఉండాల్సిన ఆవశ్యకత ఉందని కవిత గుర్తుచేశారు.


దేశంలో పాలసీ పరంగా పరిమితులు ఉన్నాయని ఎవ్వరూ భావించొద్దని, ఆన్ లైన్ లో వ్యాపారం ప్రారంభించి అంతర్జాతీయంగా ఎదిగేందుకు సైతం అవకాశాలు ఉన్నాయన్నారు. ఇండియాలో 90 శాతం స్టార్టప్ లు టీం మేనేజ్ మెంట్ లేక ఫెయిల్ అవుతున్నాయని ఒక సర్వేలో తేలిందన్నారు. స్టార్టప్లు సక్సెస్ అవ్వాలంటే ఐడియాతో పాటు, టీం మేనేజ్ మెంట్ కూడా ముఖ్యమన్నారు. 




తెలంగాణలో స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం, 33 శాతం మార్కెట్ కమిటీ పదవులు, షీ టీంలు, విద్యా సంస్థలు, పెన్షన్లు వంటి అనేక కార్యక్రామలతో మహిళల ఆర్థిక స్వావలంభన చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.  ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో వీ హబ్ సీఈవో దీప్తి రావుల, అశోక యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-08T23:12:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising