ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకృతి వనం కోసం పట్టా భూమి

ABN, First Publish Date - 2021-04-01T05:30:00+05:30

పల్లె ప్రకృతి వనాల కోసం అధికారులు చేపడుతున్న భూసేకరణ వివాదాలకు దారితీస్తోంది.

రైతులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతులను సంప్రదించకుండానే ఎంపిక

పనులను అడ్డుకున్న బాధితులు

మద్దిరాల, ఏప్రిల్‌ 1 : పల్లె ప్రకృతి వనాల కోసం అధికారులు చేపడుతున్న భూసేకరణ వివాదాలకు దారితీస్తోంది. మండలంలోని చౌలతండాలో పట్టా భూమిని వనం ఏర్పాటు కోసం  కేటాయించడం ఆందోళనకు దారితీసింది. కనీసం రైతులకు సమాచారం ఇవ్వకుండా అధికారులు నేరుగా పనులకు రావడాన్ని చూసి రైతులు నివ్వెరపోవాల్సిన పరిస్థితి నెలకొంది. సర్వే నెంబరు 576లో ఎకరా 3 గుంటల భూమి జి.ముత్తయ్య, సందసాని సోమయ్య, దొడ్డా నర్సయ్య, సందసాని చంద్రమౌళి పేరు మీద పట్టా ఉంది. వీరంతా కొన్నేళ్లుగా భూమిలో సాగు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. ఇంతకు ముందు ఈ సర్వే నెంబరులోని భూముల్లోంచి ఎస్సారెస్పీ కాల్వను తీశారు. అయితే పల్లె ప్రకృతి వనం ఏర్పాటు కోసం రైతులను సంప్రదించకుండానే ఎంపీడీవో నేరుగా ఈ భూమిని కేటాయించాలని పంచాయతీ కార్యదర్శి రాజును ఆదేశించారు. ఆ పనుల నిమిత్తం వెళ్లిన గ్రామకార్యదర్శిని రైతులు అడ్డుకున్నారు. దీంతో ఆయన స్థానిక పోలీస్‌ సహాయం తీసుకున్నాడు. అక్కడ చేరుకున్న పోలీసులు, అధికారులతో రైతులు వాగ్వాదం చేశారు. తమ వద్ద పట్టా పాస్‌పుస్తకాలు ఉన్నా ప్రకృతి వనం కోసం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. అయితే ఎస్సారెస్పీ కాల్వల తవ్వకంపోను అటు ఇటు భూమి మిగిలి ఉందని అది ఇదేనని అధికారులు వాదిస్తున్నారు. సర్వేయర్‌ కూడా ఇది పట్టా భూమి అని తేల్చారని; అయినా ఎం దుకు తమ భూమిలో వనం ఏర్పాటు చేస్తున్నారని వారు నిలదీశారు. దీనిపై కలెక్టర్‌కు ఆర్జీ పెట్టుకుంటామని; అప్పటివరకూ పనులను చేయనిచ్చేది లేదని రైతులు చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు. అయితే రైతులు కబ్జాలో ఉండగా ఎలాంటి సమాచారం, నోటీసు ఇవ్వకుండా వనం ఏర్పాటు కోసం సిద్ధమవడాన్ని స్థానికులు విమర్శిస్తున్నారు. గ్రామపంచాయతీ సమీపంలోనే ప్రభుత్వ భూమి ఉన్నా రైతుల పట్టా భూమిలోనే పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  


ఏడున్నర గుంటలు కాల్వకు పోయింది: దొడ్డ నర్సయ్య, రైతు

తనకున్న ఎకరం భూమిలో ఏడున్నర గుంటల భూమి ఎస్సారెస్పీ కాల్వ కోసం తీసుకున్నారని బాధిత రైతు దొడ్డ నర్సయ్య అన్నారు. నాకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని, ఈ భూమే తమకు ఆధారమన్నారు. మిగిలిన 32 గుంటల్లో 4 గుంటలు ప్రకృతి వనం కింద తీస్తే తాము తీవ్రంగా నష్టపోతామన్నారు. 


ప్రభుత్వ భూముల్లోనే వనాలు ఏర్పాటు : కిరణ్‌కుమార్‌, పీడీ

ప్రభుత్వ భూముల్లోనే పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తామని డీఆర్‌డీఏ పీడీ సుందరి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రైతుల ఫిర్యాదుపై విచారణ చేస్తామన్నారు. పేదరైతుల భూములను ప్రకృతి వనాలకు కేటాయించమన్నారు. అవి ప్రభుత్వ భూములైతే మాత్రం తీసుకుంటామన్నారు. 


Updated Date - 2021-04-01T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising