ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీనియారిటీ లిస్టులో దొర్లిన తప్పులను వెంటనే సవరించాలి

ABN, First Publish Date - 2021-12-19T05:56:26+05:30

ఉపాధ్యాయుల విభజనలో భాగంగా విద్యాశాఖ కార్యాలయం తయారు చేసిన సీనియారిటీ లిస్టులో దొర్లిన తప్పుల ను వెంటనే సవరించాలని టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్‌.రాములు డిమాండ్‌ చేశారు.

ఆందోళనలో పాల్గొన్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 డీఈఓ కార్యాలయం ఎదుట టీఎస్‌ యూటీఎఫ్‌ నిరసన 

నల్లగొండ క్రైం, డిసెంబరు 18 : ఉపాధ్యాయుల విభజనలో భాగంగా విద్యాశాఖ కార్యాలయం తయారు చేసిన సీనియారిటీ లిస్టులో దొర్లిన తప్పుల ను వెంటనే సవరించాలని టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్‌.రాములు డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అభ్యంతరాలను, లోపాలను జీఓలకు అనుకూలంగా సవరించి సమగ్రమైన సీనియారిటీ లిస్టును ప్రకటించాలని, అంతర్‌ జిల్లాల బదిలీల ద్వారా 610 జీఓ ద్వారా వచ్చినవారిని నియమ నిబంధనలకు అనుగుణంగా సీనియారిటీ లిస్టులో పొందుపర్చాలని సూచించారు. స్పెషల్‌ కేటగిరి, మెడికల్‌ సర్టిఫికెట్లు సబ్మిట్‌ చేసిన వారిని మెడికల్‌ అధికారులతో స్ర్కూట్నీ చేసి లిస్టును ప్రకటించాలన్నారు. సీనియారిటీ లిస్టులు ప్రకటించిన తర్వాత ఆప్షన్స్‌  ఎడిట్‌చేసుకునే అవకాశం ఇవ్వాలని, ఉపాధ్యాయులను జిల్లాలకు కేటాయించిన తర్వాత పాఠశాల పోస్టింగ్స్‌ విషయంపై విధి విధానాలు ఖరారు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర, ఉమ్మడి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నాయకులు రాజశేఖర్‌రెడ్డి, నాగమణి, యాకయ్య, ఎడ్ల సైదులు, పెరుమాళ్ల వెంకటేశం, మెతుకు సైదులు, సోంబాబు, శ్రీనివాసచారి, దామోదర్‌, రాగి రవీందర్‌, అరుణ, ధనరాజ్‌, మంగ, కమల, శేఖర్‌రెడ్డి ఉన్నారు.  

Updated Date - 2021-12-19T05:56:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising