ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరస్వతీ నిలయంలో సమస్యలు

ABN, First Publish Date - 2021-08-27T06:33:52+05:30

కరోనాతో మూసివేసిన పాఠశాలల ఆకతాయిలకు అడ్డాగా మారింది. పాఠశాలను మద్యం ప్రియులు అడ్డాగా మార్చుకు న్నారు. పాఠశాల తరగతి గదుల తలుపులు, కిటికీలను ధ్వం సం చేశారు. సరస్వతి నిలయంలో సమస్యలు తిష్ట వేసినా అధికారులు, ప్రజాప్రతిని ధులు పట్టించుకోవడంలేదు. రాత్రయిందంటే చాలు యాదాద్రి పట్టణం నడిబొడ్డున ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఆకతాయిలు వాలుతున్నారు.

పాఠశాల తరగతి గదిలో ఖాళీ సీసాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి పాఠశాలలో ఆకతాయిల తిష్ఠ  

 తరగతి గదుల్లో అసాంఘిక కార్యకలాపాలు 

 తలుపులు, కిటికీలు ధ్వంసం

యాదాద్రి రూరల్‌, ఆగస్టు 26: కరోనాతో మూసివేసిన పాఠశాలల ఆకతాయిలకు  అడ్డాగా మారింది. పాఠశాలను మద్యం ప్రియులు అడ్డాగా మార్చుకు న్నారు. పాఠశాల తరగతి గదుల తలుపులు, కిటికీలను ధ్వం సం చేశారు.  సరస్వతి నిలయంలో సమస్యలు తిష్ట వేసినా అధికారులు, ప్రజాప్రతిని ధులు పట్టించుకోవడంలేదు.  రాత్రయిందంటే చాలు యాదాద్రి  పట్టణం నడిబొడ్డున ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఆకతాయిలు వాలుతున్నారు. తరగతి గది తాళాలను ధ్వంసం చేశారు. నిత్యం తరగతి గదుల్లో  అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతు న్నారు. దీంతో పాఠశాలకు వెళితే దుర్వాసన వస్తోంది.  పక్కనే ఎంఈవో  కార్యాలయం ఉన్నా అధికారులు పట్టించు కోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. ప్రభుత్వం ఆదేశం మేరకు  మరో నాలుగు రోజుల్లో పాఠశాల పునఃప్రారంభం కావాల్సి ఉంది.  పాఠశాల ఆవరణలో ఖాళీమందు బాటిళ్లు, చికెన్‌ముక్కలు దర్శనమిస్తున్నాయి. అధికారులు స్పందించి  పాఠశా ల పరిరక్షణకు, పరిశుభ్ర వాతావరణానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

పోలీసులకు సమాచారం ఇచ్చాం

పాఠశాలకు నైట్‌ వాచ్‌మెన్‌ లేడు. ఉన్న ఒక్క  అటెండర్‌ను ఎంపీడీవో కార్యాలయం వారు తీసుకున్నారు.పాఠశాలలో అసాంఘిక కార్యక్రమాలు జరు గుతున్నాయని గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చే శాం.అయినా పాఠశాల పరిస్థితిలో మార్పు రాలేదు.  

– జె.కృష్ణ, ఎంఈఓ





Updated Date - 2021-08-27T06:33:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising