ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌ బోధనతో విద్యార్థులు నష్టపోయారు

ABN, First Publish Date - 2021-09-02T07:06:55+05:30

కొవిడ్‌ దృష్ట్యా ఆన్‌లైన్‌ విద్యలో విద్యార్థులు రాణించలేకపోయారని, ప్రత్యేక తరగతుల ద్వారానే బోధించి విద్యార్థులను ప్రయోజకులను చేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యుడు పొనుగోటి అంజన్‌రావు సూచించారు.

మర్రిగూడ జడ్పీ పాఠశాల పరిసరాలను పరిశీలిస్తున్న అంజన్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలల హక్కుల కమిషన్‌ సభ్యుడు పొనుగోటి అంజన్‌రావు 

మర్రిగూడ, సెప్టెంబరు 1: కొవిడ్‌ దృష్ట్యా ఆన్‌లైన్‌ విద్యలో విద్యార్థులు రాణించలేకపోయారని, ప్రత్యేక తరగతుల ద్వారానే బోధించి విద్యార్థులను ప్రయోజకులను చేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యుడు పొనుగోటి అంజన్‌రావు సూచించారు. మర్రిగూడలోని ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను సందర్శించి అక్కడ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ విద్యతో నష్టపోయారని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. అనంతరం పలు పాఠశాలల ఉపాధ్యాయులతో ఆన్‌లైన్‌ విద్యా బోధనపై సమావేశం నిర్వహించి, పాఠశాలల్లో మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారివెంట జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, మర్రిగూడ విద్యాశాఖ అధికారి గురువరావు, హెచ్‌ంలు శివ, స్వరూప, భిక్షమయ్య, సుమతి, కృష్ణ ఉన్నారు. 

Updated Date - 2021-09-02T07:06:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising