ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కులవృత్తుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

ABN, First Publish Date - 2021-08-27T05:36:47+05:30

రాష్ట్రంలోని అన్ని కుల వృత్తుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేస్తుందని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు. మండలకేంద్రం

తుంగతుర్తిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుంగతుర్తి/ మద్దిరాల, ఆగస్టు 26: రాష్ట్రంలోని అన్ని కుల వృత్తుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేస్తుందని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు. మండలకేంద్రంలోని విద్యుత్‌శాఖ కార్యాల యంలో రజక, నాయీబ్రహ్మణులకు గురువారం విద్యుత్‌ మీట ర్లు పంపిణీ చేశారు. 250యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ప్రభుత్వం ఇవ్వనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 100మందికి పైగా నాయీ బ్రహ్మణులు, రజకులకు లబ్ధి చేకూరుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ప్రభుత్వానికి దక్కిందన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా కోర్డినేటర్‌ రజాక్‌, గుడిపాటి సైదులు, యాదగిరిగౌడ్‌, దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు. తుంగతుర్తి మండల పరిధిలోని గోరెంట్లలో మెగా పల్లె ప్రకృతి వనం, సీసీరోడ్డుకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. కార్య క్రమం లో డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ ఎస్‌ఎ రజాక్‌, సర్పంచ్‌ దామెర్ల వెంకన్న, ఎంపీటీసీ శిరంశెట్టి వెంక న్న, తాహసీల్దార్‌ మన్నన్‌, ఎంపీడీవో సరోజ ఉన్నారు. అర్వపల్లిలో విద్యుత్‌ శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మె ల్యే గాదరి కిషోర్‌కుమార్‌ మాట్లాడారు. గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను, కరెంట్‌ తీగలు, లూజ్‌లైన్లను మరమ్మతులు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, డీఈ వెంకటేశ్వర్లు, పీఏసీఎస్‌ చైర్మన్‌ కుంట్ల సురేందర్‌రెడ్డి, లక్ష్మినర్సయ్యయాదవ్‌, కనుకు శ్రీనివాస్‌, బైరబోయిన రామలింగయ్య, ఉపసర్పంచ్‌ పులిచర్ల ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-27T05:36:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising