అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ABN, First Publish Date - 2021-12-19T05:39:34+05:30
భుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా కలెక్టర్లు దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ సూ చించారు. హైదరాబాద్ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం జిల్లా కలెక్టర్ల తో సమీక్షా సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ల సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్
భువనగిరి రూరల్, డిసెంబరు 18: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా కలెక్టర్లు దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ సూ చించారు. హైదరాబాద్ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం జిల్లా కలెక్టర్ల తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కలెక్టర్ల సమావేశంలో దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షలో కలెక్టర్ పమేలాసత్పథి పాల్గొని యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవన నిర్మాణం దాదాపు పూర్తయిందని తెలిపారు. బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని, సీఎం దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో నిర్వహిస్తున్న పలు పథకాలపై వివరించారు.
Updated Date - 2021-12-19T05:39:34+05:30 IST