'దళిత బంధు'ను దేశమంతా అమలు చేయాలి: నామా
ABN, First Publish Date - 2021-08-10T22:47:42+05:30
ఢిల్లీ: రైతు బంధు తరహాలోనే దళిత బంధు పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు.
ఢిల్లీ: రైతు బంధు తరహాలోనే దళిత బంధు పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ ఓబీసీ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. సుప్రీం కోర్టు తీర్పు వల్ల ఈ రాజ్యంగ సవరణ బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందని.. ఈ బిల్లును టీఆర్ఎస్ స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఓబీసీల అభ్యున్నతి, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు ప్రవేశ పెట్టారని గర్తు చేశారు. దళిత బంధు పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.10లక్షలు అందిస్తోందన్నారు. దళితుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని.. ఇందుకు దళిత బంధు పథకమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2021-08-10T22:47:42+05:30 IST