ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఏసీఎ్‌సలకు కొత్త రూపు

ABN, First Publish Date - 2021-03-03T05:32:42+05:30

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు కొత్త కళ సంతరించుకోనున్నాయి. బహుళార్ధక సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. వ్యాపారాలు చేసి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నాబార్డు చేయూతనిస్తోంది. ఇన్నాళ్లూ పీఏసీఎ్‌సలు మూస పద్ధతిలో రుణాలు ఇవ్వడం.. వాటిని తిరిగి రాబట్టడంలాంటి పనులే చేసేవి. ఈ క్రమంలో అనేక సంఘాలు అప్పుల ఊబిలో కూరుకుపోగా కొన్ని లాభాలతోనూ సాగుతున్నాయి. ఇంకొన్ని మూతపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటి పరిస్థితి సేవా కేంద్రాల ఏర్పాటుతో మారబోతోంది. పని తీరులో సంస్కరణలు చోటు చేసుకుంటాయి. మొదటి దశలో 44 సంఘాలు కొత్త వ్యాపారాలు చేపట్టేందుకు ముందుకు రాగా, మిగతావి కూడా త్వరలో ముందుకు రానున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్థికంగా బలోపేతానికి బాటలు
44 సంఘాల ఆధ్వర్యంలో సేవా కేంద్రాలు
ప్రతిపాదనలకు నాబార్డు ఆమోదం
రూ. 31.26 కోట్ల రుణ సాయం
ఇక సంఘాల మూస పనితీరుకు స్వస్తి

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు కొత్త కళ సంతరించుకోనున్నాయి. బహుళార్ధక సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. వ్యాపారాలు చేసి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నాబార్డు చేయూతనిస్తోంది. ఇన్నాళ్లూ పీఏసీఎ్‌సలు మూస పద్ధతిలో రుణాలు ఇవ్వడం.. వాటిని తిరిగి రాబట్టడంలాంటి పనులే చేసేవి. ఈ క్రమంలో అనేక  సంఘాలు అప్పుల ఊబిలో కూరుకుపోగా కొన్ని లాభాలతోనూ సాగుతున్నాయి. ఇంకొన్ని మూతపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటి పరిస్థితి సేవా కేంద్రాల ఏర్పాటుతో మారబోతోంది. పని తీరులో సంస్కరణలు చోటు చేసుకుంటాయి. మొదటి దశలో 44 సంఘాలు కొత్త వ్యాపారాలు చేపట్టేందుకు ముందుకు రాగా, మిగతావి కూడా త్వరలో ముందుకు రానున్నాయి.


హన్మకొండ (ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 44 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్‌) బహుళార్ధ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. వరంగల్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఈ మేరకు పంపిన ప్రతిపాదనలకు నాబార్డు ఆమోదం తెలిపింది. ఇక నిధుల విడుదలే తరువాయి. మొదటి దశ కింద ఈ సేవా కేంద్రాల ఏర్పాటుకు మొత్తం రూ.34.73కోట్లు అవసరమవుతాయి. ఇందులో నాబార్డు 90 శాతం రుణంగా అంటే రూ. 31.26 కోట్లను అందచేస్తుంది. మిగతా పది శాతం రూ. 3.47 కోట్లను పీఏసీఎ్‌సలు సమకూర్చు కుంటాయి.

89 సేవా కేంద్రాలు

44 పీఏసీఎ్‌సలు మొత్తం 89 బహుళార్ధ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తాయి. వీటిలో ఎక్కువ గోదాములు, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయశాలలు ఉన్నాయి. 1500, 1000, 500 మెట్రిక్‌ టన్నుల నిలువ సామర్ధ్యం కలిగిన 44 గోదాములు, 22 అగ్రి ఔట్‌లెట్స్‌, రెండు సరుకు రవాణా వాహనాలు, 4 హార్వెస్టర్లు, సమావేశ మందిరాలతో కూడిన 7 రైతు శిక్షణా కేంద్రాలు, 8 వేర్‌హౌ్‌సలు, 2 కోల్డ్‌ స్టోరేజీలు వీటిలో ఉన్నాయి. ఈ సంఘాలు ఆదాయాన్ని సమకూర్చుకొని ఆర్థికంగా బలోపేతం అవుతాయి. గ్యాస్‌ ఏజెన్సీలు, పెట్రోల్‌ బంకులు, సూపర్‌బజార్లు, విత్తన విక్రయ కేంద్రాలు,  వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశం ఉంది. అయితే వీటికి తగిన స్థలం ఆ సొసైటీలకు ఉండాలి.

నాబార్డు చేయూత

పీఏసీఎస్‌ బహుళార్ధ సేవాకేంద్రాల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని నాబార్డు సమకూరుస్తుంది. సహకార సంఘాలకు నేరుగా నాబార్డు రుణం ఇవ్వకుండా బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి అందిస్తుంది. ఇందులో వ్యవసాయ, రైతు శిక్షణ కేంద్రాల ఏర్పాటు, వ్యవసాయాధారిత గోదాములు, పరిశ్రమలకు 3 శాతం, ఇతర వ్యాపారాలకు 4శాతం వడ్డీ  చొప్పున రుణం ఇస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్బర్‌ భారత్‌ అభియాన్‌ ద్వారా నిధులు సమకూరుస్తుంది. ఇలా 15 రకాల వ్యాపార సేవా కేంద్రాల ఏర్పాటుకు నాబార్డు రుణం మంజూరు చేస్తోంది. వ్యవసాయాధారిత పరిశ్రమలు, రైతు శిక్షణా కేంద్రాలు, రైతు గోదాముల ఏర్పాటు చేస్తే 25 శాతం రాయితీ లభిస్తుంది.

నిబంధనలు
ఏ పీఏసీఎస్‌ అయినా బహుళార్ధ సేవా కేంద్రాలుగా ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా అవి లాభాలబాటలో ఉన్న సంఘమై ఉండాలి. సొంత భవనం, సొంత స్థలం కలిగి ఉండాలి. వరుసగా మూడేళ్లపాటు సంఘం ఎలాంటి ఒడుదుడుకులు, అప్పులు కాకుండా ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సంఘం పని తీరు ఉండాలి. దీనిని నాబార్డు బ్యాంకుల ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి రుణాలు మంజూరు చేస్తుంది.

ఆమోదం పొందినవి ఇవే..
బహుళార్ధ సేవా కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనల ఆమోదం పొందిన 44 పీఏసీఎ్‌సలలో ములుగు, వంచనగిరి, మరిపెడ, సంగెం, గురిజాల, నాచినపల్లి, అమీనాబాద్‌, రెడ్లవాడ, ఎలుకుర్తి, గీసుకొండ, నర్మెట, మహ్మదాపూర్‌, దన్నసరి, తొర్రూరు, మహబూబాబాద్‌, ఎర్రబెల్లి గూడెం, నెల్లికుదురు, నర్సింహులపేట, శ్రీరామగిరి, డోర్నకల్‌, కేసముద్రం, రెబర్తి, బచ్చన్నపేట, పాలకుర్తి, స్టేషన్‌ఘనపూర్‌, లింగాలఘణపురం, నందనం, చీటకోడూరు, జనగామ, వెంకటాపురం, పెంచికల్‌పేట, మన్నేగూడెం, గూడూరు, రాయపర్తి, గోవిందరావుపేట, చిట్యాల, నర్సంపేట, నల్లబెల్లి, కామపల్లి, మెగుళ్ళపల్లి, ధర్మసాగర్‌, నెక్కొండ, పొగుళ్లపల్లి, పర్వతగిరి ఉన్నాయి.

Updated Date - 2021-03-03T05:32:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising