ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

ABN, First Publish Date - 2021-05-31T04:28:20+05:30

అకాల వర్షం కారణంగా రైతు కష్టం నీటి పాలయిం ది. మండలంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయింది.

అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సదాశివనగర్‌, మే 30: అకాల వర్షం కారణంగా రైతు కష్టం నీటి పాలయిం ది. మండలంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయింది. అడ్లూర్‌ ఎల్లారెడ్డి కొనుగోలు కేంద్రం వద్ద సుమారు 4,500 ధాన్యం బస్తాలు తడిసిపోయినట్లు సహకార సంఘం చైర్మన్‌ సదాశివరెడ్డి తెలిపారు. కాగా ఆదివారం జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి కొండల్‌రెడ్డి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఆయన రైతులతో మాట్లాడగా తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలని మొరపెట్టుకు న్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట రాత్రి కురిసిన వర్షానికి తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీటీ శ్రీకాంత్‌, సీఈవో బైరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి: మండలంలోని లింగారెడ్డిపేట్‌ కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్‌ స్వామి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మం డలంలో 23 కొనుగోలు కేంద్రాలకు గాను 20 కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామన్నారు. మరో 3 కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వ ఉందని అది కూడా త్వరలోనే కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్‌లు, కార్యదర్శి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-31T04:28:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising