ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-11-02T05:37:59+05:30

భిక్కనూరు గ్రామసమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్లు ఎస్సై నవీన్‌కుమార్‌ సోమవారం తెలి పారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గ్రామానికి చెందిన మ్యాదరి బాల్‌కుమార్‌(38) పెద్దమల్లారెడ్డి నుంచి ఆదివారం రాత్రి భిక్కనూరుకు ద్విచ క్రవాహనంపై వస్తుండగా అతివేగంతరోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొన డంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భిక్కనూరు, నవంబరు 1: భిక్కనూరు గ్రామసమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్లు ఎస్సై నవీన్‌కుమార్‌ సోమవారం తెలి పారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గ్రామానికి చెందిన మ్యాదరి బాల్‌కుమార్‌(38) పెద్దమల్లారెడ్డి నుంచి ఆదివారం రాత్రి భిక్కనూరుకు ద్విచ క్రవాహనంపై వస్తుండగా అతివేగంతరోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొన డంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య అనసూయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామా రెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడు..
తాడ్వాయి, నవంబరు 1: మండల కేంద్రంలోని దేమికలాన్‌ రోడ్డు సమీపం లో తాడ్వాయి కల్లుడిపో ప్రాంతంలోని బావిలో అనుమానస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందాడు. మండలంలోని దేమికలాన్‌ గ్రామానికి చెందిన గడిగే రాజు (25) నాలుగురోజుల క్రితమే బావిలో పడి మృతిచెందినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గడిగే రాజు గురువారం ఉదయం ఇంట్లోంచి బయటకు వెళ్లి రాత్రి వరకు ఇంటికి తిరిగిరాలేదు. బంధువుల ఇంటికి వెళ్లాడమోనని కుటుంబీకులు భావించారు. కానీ ఆదివారం రాత్రి కొందరు దేమికలాన్‌ గ్రామానికి చెందిన వారు అటువైపు వెళ్లిబావిలో ఉన్న శవాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని దేమికలాన్‌లోని మృతుడి భార్య సౌందర్యకు తెలిపారు. తాడ్వాయికి వచ్చిన శవాన్నిచూసి రాజుగా గుర్తించారు. రాజు మత్తులోఉండి బావి వైపు వెళ్లి కాలుజారి పడి మృతిచెంది ఉండవచ్చని భార్య సౌందర్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ఎవరిపై అనుమానం లేదని ఫిర్యాదులో పేర్కొనట్లు ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడికి భార్య సౌందర్య, 16 నెలల కుమారుడు, తల్లి పోచవ్వ, బాలరాజు ఉన్నారు.

Updated Date - 2021-11-02T05:37:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising