ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతును రాజు చేయడమే సీఎం లక్ష్యం

ABN, First Publish Date - 2021-12-31T05:30:00+05:30

రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వేద సాయి చందర్‌ అన్నారు.

గోదాంను ప్రారంభిస్తున్న రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నస్రుల్లాబాద్‌, డిసెంబరు 31: రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వేద సాయి చందర్‌ అన్నారు. శుక్రవారం నస్రుల్లాబాద్‌ మండలంలోని మైలారం గ్రామ పరిధిలో రూ.9.33కోట్లతో నూతనంగా నిర్మించిన 13.400టన్నుల సామర్థ్యం గల గోదాంను స్పీకర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ తెలంగాణ ప్రాంతంలో గోదాంల సామర్థ్యం 2014 కంటే ముందు కేవలం 4.5లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమేనన్నారు. సీఎం కేసీఆర్‌ చొరవ తో మార్కెట్‌ కమిటీల ద్వారా 20లక్షల మెట్రిక్‌ టన్నుల గోదాంలను నిర్మి  ంచారన్నారు. అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వరి ధాన్యం దిగుబడుల్లో బాన్సువాడ నియోజకవర్గం రాష్ట్రంలో ముందంజలో ఉందన్నారు. రైతులు కాడి దించి వ్యవసాయం బంద్‌ చేస్తే దేశం అల్లకల్లో లం అవుతుందన్నారు. రైతులకు కులం, మతం లేదన్నారు. దేశంలో అన్ని రాష్ర్టాలకు సమాన హోదాలో చూడాలన్నారు. ఏ పంటలు పండించాలో నిర్ణయించుకునేది రైతులేనన్నారు. రైతులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెద్ద మనస్సుతో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో తెలంగాణ వ్యవసాయరంగంలో సాగు, దిగుబడులు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, పోచారం సురేందర్‌ రెడ్డి, పెర్క శ్రీనివాస్‌, ద్రోణవల్లి సతీష్‌, ద్రోణవల్లి అశోక్‌, ఎంపీపీ విఠల్‌, జడ్పీటీసీ జన్నుబాయి ప్రతాప్‌ సింగ్‌, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

Updated Date - 2021-12-31T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising