ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శవయాత్రపై పిడుగుపాటు

ABN, First Publish Date - 2021-07-07T05:36:44+05:30

శవయాత్రపై పిడుగుపాటు

బాధితుడికి సపర్యలు చేస్తున్న యువకుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగెం, జూలై 6: ఓ యువకుడి అంతిమయాత్ర జరుగుతుండగా పిడుగు పడ డంతో పలువురికి గాయాలైన ఘటనతో మంగళవారం వరంగల్‌రూరల్‌ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి ఉలిక్కిపడింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం. గ్రామానికి చెందిన కారింగుల ప్రవీణ్‌(30) గుండెపోటుతో మృతిచెందగా, అతడి అంతిమయాత్ర నిర్వహిస్తుండగా వర్షం పడింది. అదే సమయంలో పిడుగు పడిం ది. ఒక్కసారిగా 20 మందికిపైగా కూప్పకూలిపోయారు. మరికొంత మంది భయం తో పరుగులు పెట్టారు. 20 మంది ఒకరిపై ఒకరు పడిపోయారు. వృద్ధులు, యువ కులు కిందపడటంతో పాటు చింతనెక్కొండకు చెందిన ఇద్దరు యువకులకు ఛాతి పైన మంటలు వచ్చి గాయాలయ్యాయి. షాపురంనకు చెందిన దొనికెల కుమార స్వామికి కూప్ప కూలిపోవడంతో మానసికంగా దెబ్బతిన్నాడు. మొండ్రాయికి చెంది న రాంగోపాల్‌ కిందపడగా, ఆయనపై పలువురు పడిపోయారు. పర్వతగిరి మం డల కేంద్రానికి చెందిన  రావుల శంకర్‌కు తీవ్ర అస్వస్తత కావడంతో ఆస్పత్రికి తర లించారు. గాయపడిన తీగరాజుపల్లికి చెందిన మోడెం స్వరూప, చింతనెక్కొండకు చెందిన పుట్ట నరేష్‌, పూజారి అరవింద్‌, నరిగే కొమురమ్మ, ధర్నోజు రాకేష్‌, మారబోయిన రాకేష్‌లను ఎంజీఎంకు 108వాహనంలో తరలించారు. వర్ధన్నపేట మండలం కాట్ర్యాలచెందిన చెంగలి రేణుకకు చెందిన పుస్తెలతాడు పిడుగుపాటుకు ముక్కలు ముక్కలుగా కావడంతో పాటు తీవ్రంగా గాయాలయ్యాయి. విషయం క్షణాల్లో ఊరంతా పాకడంతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు.


Updated Date - 2021-07-07T05:36:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising