ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీవీ జ్ఞాపకార్థం పోస్టల్‌ స్టాంప్‌

ABN, First Publish Date - 2021-02-05T08:47:46+05:30

మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం పోస్టల్‌ స్టాంపును విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
  • వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి 
  • కేసీఆర్‌ ప్రతిపాదనమేరకే : ఎంపీ నామా


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం పోస్టల్‌ స్టాంపును విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో కలిసి ప్రఽధాని మోదీతో ఈ విషయంపై చర్చించిన తర్వాత ఈమేరకు సర్కార్‌ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా పీవీ  ప్రజలకు ఎనలేని సేవలు అందించారని కిషన్‌ రెడ్డి గుర్తుచేసుకున్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్న  సమయంలో  మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు సమర్థమంతంగా నడిపించిన  గొప్ప రాజనీతిజ్ఞడు పీవీ అని కేంద్రమంత్రి కొనియాడారు.  


కేంద్ర నిర్ణయంపై  ఎంపీ నామా హర్షం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపాదన మేరకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు  జ్ఞాపకార్థం పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించడం పట్ల  టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు హర్షం వ్యక్తంచేశారు.  ఈ అంశంపై గతంలో కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు కేసీఆర్‌ లేఖ రాశారని  ఆయన గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత పీవీకే దక్కుతుందని పేర్కొన్నారు. పీవీ సేవలను గుర్తించి ఆయనకు భారతరత్న ప్రకటించాలని నామా  నాగేశ్వరరావు డిమాండ్‌  చేశారు. 


Updated Date - 2021-02-05T08:47:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising