ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రెయిన్‌ స్ట్రోక్‌పై అవగాహన కల్పించాలి

ABN, First Publish Date - 2021-10-30T07:51:05+05:30

గుండెపోటు ఎలా వస్తుందో, ఎలా అప్రమత్తంగా ఉండాలో చాలా మందికి అవగాహన ఉందని, పక్షవాతంపై సరైన అవగాహన లేదని, ఈ విషయంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యశోదలో  ‘బై-ప్లేన్‌ న్యూరో క్యాథ్‌ల్యాబ్‌’ ప్రారంభించిన గవర్నర్‌

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): గుండెపోటు ఎలా వస్తుందో, ఎలా అప్రమత్తంగా ఉండాలో చాలా మందికి అవగాహన ఉందని, పక్షవాతంపై సరైన అవగాహన లేదని, ఈ విషయంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌  డే సందర్బంగా శుక్రవారం యశోద ఆస్పత్రిలో అత్యాధునిక ‘బై-ప్లేన్‌ న్యూరో క్యాథ్‌ల్యాబ్‌’ను ఆమె ప్రారంభించారు. పక్షవాత లక్షణాలపై  వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. టెన్షన్‌, హైపర్‌ టెన్షన్‌ తో కూడా చాలా మంది పక్షవాతం బారిన పడుతున్నారని చెప్పారు. పక్షవాతం వచ్చిన తర్వాత వీలైనంత త్వరగా ఆస్పత్రికి రాగలిగితే దానిని నివారించవచ్చని యశోదా ఆస్పత్రుల డైరెక్టర్‌ డాక్టర్‌  పవన్‌ గోరుకంటి తెలిపారు. వైద్య రంగంలో వచ్చే అత్యాధునిక వైద్య విధానాలను అందించడంలో ఎల్లప్పుడూ తమ ఆస్పత్రి ముందుంటుందన్నారు.  డాట్స్‌ టెక్నాలజీతో పనిచేసే బై ప్లేన్‌ న్యూరో అంజియో పోసీజర్‌ సూట్‌ను అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణంగా ఉందని చెప్పారు. దేశంలో ప్రతి ఏటా కొత్తగా 18 లక్షల బ్రెయిన్‌ స్ట్రోక్‌ కేసులు వస్తున్నట్లు న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ కోమల్‌ తెలిపారు. వైద్యులు లింగయ్య, ఆనంద్‌ బాలసుబ్రహ్మణ్యం, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T07:51:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising