ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త రైతులు ‘రైతుబీమా’కు నమోదు చేసుకోవాల్సిందే!

ABN, First Publish Date - 2021-08-09T08:10:07+05:30

రైతుబీమా.. అన్నదాతలు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే పథకం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

11లోగా ధ్రువపత్రాలివ్వాలి.. 14 నుంచి పథకం రెన్యువల్‌

హైదరాబాద్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): రైతుబీమా.. అన్నదాతలు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే పథకం. నిర్ణీత వయోపరిమితి (18-59ఏళ్లు) పరిఽధిలో ఉన్న రైతులు ఈ పథకంలో మళ్లీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, క్రయవిక్రయాల ద్వారా కొత్తగా భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతులు, నిర్ణీత వయోపరిమితి పరిధిలో ఉండి గతంలో నమోదు చేసుకోని వారు, కొత్తగా 18 ఏళ్లు నిండిన రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. భూమి రిజిస్ట్రేషన్‌ ఈ నెల 3లోపు పూర్తయిన వారికి మాత్రమే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాల ద్వారా తెలిసింది. రైతుల వయసుకు ఆధార్‌ కార్డుపై ఉన్న తేదీలు, చిరునామానే ప్రామాణికంగా తీసుకుంటారు. రైతుబీమాలో చేరే రైతులు ఏఈవో (వ్యవసాయ విస్తరణాధికారి)కి దరఖాస్తును నింపి ఇవ్వాలి. భూమి పాస్‌ పుస్తకం, ఆధార్‌కార్డు, నామినీకి చెందిన ఆధార్‌కార్డు జిరాక్సు కాపీలతో ఈ నెల 11లోపు దరఖాస్తులు సమర్పించాలి. ఎల్‌ఐసీకి రైతుల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు 12న సమర్పిస్తారు. రాష్ట్రంలో మూడో ఏడాదికి సంబంధించిన పథకం గడువు ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రికి ముగుస్తుండగా.. 14 నుంచే నాలుగో ఏడాదికి బీమా రెన్యువల్‌ చేసేందుకు వ్యవసాయశాఖ సమాయత్తం అవుతోంది. కాగా, రైతుబీమాకు రూ.800 కోట్లు విడుదల చేసినప్పటికీ 33 లక్షల మంది రైతులకు ప్రీమియం చెల్లించడానికి ప్రభుత్వం మరో రూ.400 కోట్లు  విడుదల చేయాల్సి ఉంటుంది.

Updated Date - 2021-08-09T08:10:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising