మాదాపూర్‌లో బెస్ట్ విజన్ ఐ హాస్పిటల్ ప్రారంభం
ABN, First Publish Date - 2021-08-28T17:30:54+05:30
బెస్ట్ విజన్ ఐ హాస్పిటల్ మాదాపూర్‌లో ప్రారంభమైంది. కావూరిహిల్స్‌లో కొత్తగా ఏర్పాటైన ఈ ఆసుపత్రిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సన్‌షైన్ హాస్పిటల్స్ ఎండీ ఏవీ గురవారెడ్డి ప్రారంభించారు.
హైదరాబాద్: బెస్ట్ విజన్ ఐ హాస్పిటల్ మాదాపూర్‌లో ప్రారంభమైంది. కావూరిహిల్స్‌లో కొత్తగా ఏర్పాటైన ఈ ఆసుపత్రిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సన్‌షైన్ హాస్పిటల్స్ ఎండీ ఏవీ గురవారెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాదాపూర్ కార్పొరేటర్ వి జగదీశ్వర్ గౌడ్, బెస్ట్ విజన్ ఐ హాస్పిటల్స్ కో –ఫౌండర్లు డాక్టర్ సాహిత్య దేవు, డాక్టర్ దివ్య రెడ్డి పాల్గొన్నారు. ఈ ఆసుపత్రిలో అన్ని రకాల కంటి సమస్యలకూ అత్యంత వేగంగా చికిత్సను అందించనున్నట్లు తెలిపారు. లేసిక్ సర్జరీని కేవలం 1.5 సెకన్లలోనే చేస్తే, క్యాటరాక్ట్ సర్జరీని ఐదు నిమిషాలలో చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇక చిన్నారులు, పెద్ద వయసు వారికి ప్రత్యేకమైన చికిత్సనూ అందిస్తామని తెలిపారు.
Updated Date - 2021-08-28T17:30:54+05:30 IST