ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూల్చివేతలపై చిరు వ్యాపారుల ఆందోళన

ABN, First Publish Date - 2021-08-22T04:26:14+05:30

కూల్చివేతలపై చిరు వ్యాపారుల ఆందోళన

బాధిత చిరు వ్యాపారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌: గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ 3వ వార్డు, జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన హోటళ్లు, డబ్బాలను కూల్చివేయడంతో శనివారం చిరువ్యాపారులు ఆందోళన నిర్వహించారు. కాగా, దాదాపు 20 సంవత్సరాలుగా జాతీయ రహదారి పక్కన ఆంతం విల్లాస్‌ సమీపంలో పలువురు చిరువ్యాపారులు చిన్నపాటి హోటళ్లు, డబ్బాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు మున్సిపల్‌ అధికారులు జేసీబీతో తొలగించారు. సమాచారం అందుకున్న చిరువ్యాపారులు తమ జీవనోపాధిని కూల్చివేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం వద్దకు చేరుకుని అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. 3వ వార్డు కౌన్సిలర్‌ మా వద్ద డబ్బులు డిమాండ్‌ చేసిందని, మేము డబ్బులు ఇవ్వకపోవడంతోనే తమపై కక్షతో కూల్చివేతలు చేపట్టారని, కౌన్సిలర్‌కు అనుకూలంగా ఉన్నవాటిని మాత్రం తొలగించలేదని ఆరోపించారు. 3 నెలల ముందు నుంచే చెప్తున్నామని మున్సిపల్‌ కమిషనర్‌ అమరేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కూడా సమాచారం ఇచ్చామని, ఇందులో రాజకీయాలకు తావు లేదని తెలిపారు.

Updated Date - 2021-08-22T04:26:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising