ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులు సంఘటితం కావాలి

ABN, First Publish Date - 2021-12-08T05:44:18+05:30

రైతులు సంఘటితం కావాలి

ఐకేపీ అధికారులతో మాట్లాడుతున్న నర్సింహులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాబాద్‌: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామన్న అన్నదాతకు ఇబ్బందులు తప్పడంలేదని, రైతులందరూ సంఘటితం కావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు అన్నారు. మండలంలోని సర్దార్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ ఐకేపీ ఆధ్వర్యంలో  నిర్వహింస్తున్న వరిధాన్యం కొనుగోలుకేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి ధాన్యాన్ని తూర్పారపట్టాడు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నర్సింహులు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక క్వింటాల్‌ వరిధాన్యాన్ని తూకం వేయడానికి రూ.57 వసూలు చేస్తూ, 2.5కిలోలు తరుగు తీసి రైతులను నట్టేటా ముంచుతోందన్నారు. రైతుప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతుల నడ్డి విరుస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డాడు. షరతులు లేకుండా ప్రతిగింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. లేదంటే పంజాబ్‌ రైతుల తరహాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ చేవెళ్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జి గూడెం సుభా్‌షయాదవ్‌, ప్రధానకార్యదర్శి వెంకట్‌రెడ్డి, కార్యదర్శి జగదీశ్వర్‌రెడ్డి, నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, కుమార్‌, లింగం, బాల్‌రెడ్డి, రాంరెడ్డి, ప్రభు ఉన్నారు.  

Updated Date - 2021-12-08T05:44:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising