ఢిల్లీకి తరలిన ఘట్‌కేసర్ మున్సిపల్ పాలకవర్గం
ABN, First Publish Date - 2021-11-19T05:24:48+05:30
ఢిల్లీకి తరలిన ఘట్‌కేసర్ మున్సిపల్ పాలకవర్గం
- రేపు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు స్వీకరణ
ఘట్‌కేసర్: స్వచ్ఛ సర్వేక్షణ్-2021 అవార్డుకు ఎంపికైన ఘట్‌కేసర్ మున్సిపాలిటీ అవార్డును అందుకోవడానికి కౌన్సిల్ సభ్యులు, మహిళా కౌన్సిలర్ల భర్తలు, సోదరుడు, కోఆప్షన్ సభ్యుల కుటుంబీకులు గురువారం ఢిల్లీకి తరలి వెళ్లారు. 20న ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని చైర్‌పర్సన్ పావని, కమిషనర్ వసంతకు ఆహ్వానాలు అందాయి. వారం రోజులగా పాలకవర్గం చర్చించుకొని అందరూ ఢిల్లీకి వెళ్లారు. మున్సిపాలిటీలో 18మంది కౌన్సిలర్లు, నలుగురు కోఆప్షన్ సభ్యులుండగా ఆరుగురు కౌన్సిలర్లు, ఓ కోఆప్షన్ సభ్యుడు ఢిల్లీకి వెళ్లలేదు. మొత్తం 18 మంది గురువారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లారు. 20న అవార్డు అందుకున్న అనంతరం అందరూ వివిధ ప్రదేశాలు చూసి 21న తిరుగు ప్రయాణం కానున్నట్లు సమాచారం. కేవలం చైర్‌పర్సన్, కమిషనర్ ఇద్దరికే ఆహ్వానాలు అందగా ఢిల్లీ విహారయాత్రకు అవార్డు సాకుతో అందరూ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
Updated Date - 2021-11-19T05:24:48+05:30 IST