ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూండా రాజకీయాలు మానుకోవాలి

ABN, First Publish Date - 2021-11-01T05:11:13+05:30

గూండా రాజకీయాలు మానుకోవాలి

గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బీజేపీ యువమోర్చా రాష్ట్ర నాయకులు వివేకానందరెడ్డి 


వికారాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ గూండా రాజకీయాలు మానుకోవాలని బీజేపీ యువమోర్చా రాష్ట్ర నాయకులు వివేకానందరెడ్డి అన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో ఈవీఎంలను బయటకు తీసుకురావడాన్ని నిరసిస్తూ ఆదివారం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ఓటమి భయంతోనే అక్కడి ప్రజలను ప్రలోబాలకు గురిచేసి గూండా రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అయినా ప్రజలు చైతన్యవంతులై ఎవరికి ఓటు వేయాలో వారికే వేశారని అని ఆయన అన్నారు. నాయకులు బస్వరాజ్‌, రవితేజ, సాయి, వెంకట్‌, ఆదర్శ్‌, విష్ణు, కార్తీక్‌, సాకేత్‌, రాహుల్‌, రమణ పాల్గొన్నారు. అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి టీఆర్‌ఎస్‌ నాయకుల తీరుకు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలు ధరించి పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి  నిరసన వ్యక్తం చేశారు. పట్నం మహిపాల్‌రెడ్డి, భరత్‌కుమార్‌, విజయరాజ్‌, రవీందర్‌రెడ్డి, బస్వలింగం, రవీందర్‌రెడ్డి, సాయి వెంకట్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-01T05:11:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising