ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్లాల వద్దే ధాన్యం కొనుగోళ్లు

ABN, First Publish Date - 2021-11-03T04:56:53+05:30

కల్లాల వద్దే ధాన్యం కొనుగోళ్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాద్‌నగర్‌: వానకాలంలో పండించిన వరి ధాన్యాన్ని అధికారులు రైతుల కల్లాల వద్దనే కొనుగోలు చేయాలని, ఈ విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ సూచించారు. తరగు, తాలు పేరుతో కిలో కూడా తగ్గించవద్దని అన్నారు. మంగళవారం క్యాంప్‌ కార్యాలయంలో వ్యవసాయ, సివిల్‌ సప్లయీస్‌, ఎఫ్‌సీఐ, పీఏసీఎస్‌ అధికారులతో సమావేశం ని ర్వహించారు. గన్నీ బ్యాగుల కొరత, ధర, తరగు, తాలు  తదితరాంశాలపై చర్చించారు. వానకాంలో 37వేల ఎకరాల్లో వరి వేశారన్నారు. వడ్ల కొనుగోళ్లలో రైతులకు అన్ని రకాలుగా సహాయం చేయాలన్నారు. అధికారులు, మి ల్లర్లు నేరుగా కల్లాల వద్దే కాంట పెట్టుకోవాలన్నారు. వడ్ల నాణ్యతను బట్టి అక్కడిక్కకడే ధర నిర్ణయించాలన్నారు. గన్నీ బ్యాగులను సొసైటీల్లో నిల్వ చేయాలని అధికారులకు సూచించారు. మొదట సన్న, చిన్న కారు రైతులకు బ్యాగులను అందజేయాలని చైర్మన్లను ఆదేశించారు. షాద్‌నగర్‌ నియోజకవర్గంలో 8 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అంజయ్యయాదవ్‌ తెలిపారు. 

తాగునీటికి ఇబ్బందులుండవు

మిషన్‌ భగీరథతో పట్టణంలో నీటి సమస్య పూర్తిగా తీరనుందని ఎమ్మెల్యే అన్నారు. తొందరలోనే షాద్‌నగర్‌లో పూర్తిస్థాయిలో ఇంటింటికీ నల్లాను ఏర్పాటు చేస్తామన్నారు. చటాన్‌పల్లిలో నల్లాలను ఆయన ప్రారంభించారు. మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, వైస్‌చైర్మన్‌ నటరాజన్‌, కౌన్సిలర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


  • కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల అందజేత 


ఫరూఖ్‌నగర్‌ మండలానికి చెందిన 22మంది మహిళలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అందజేశారు. ఈ పథకంతో పేదింటి ఆడపిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతోందని, పేద తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటోందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మెన్‌ తదితరులు పాల్గొన్నారు.


పర్యావరణాన్ని కాపాడుకుందాం

కొత్తూర్‌: పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. కొత్తూరు 4వ వార్డులోని ధరణి వెంచర్‌లోని 10శాతం భూమిలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి-నర్సరీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కొత్తూర్‌ పారిశ్రామిక ప్రాంతం కావడంతో కాలుష్యం అధికంగా ఉంటుందని, కాలుష్యాన్ని పారదోలాలంటే ప్రతీ ఇంటి వద్ద, రోడ్ల పక్కన మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లావణ్యదేవేందర్‌యాదవ్‌, వైస్‌చైర్మన్‌ డి.రవీందర్‌, కౌన్సిలర్లు సోమ్లనాయక్‌, కోస్గి శ్రీనివాస్‌, ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్‌, కమిషనర్‌ వీరేందర్‌, మేనేజర్‌ మంజులత, నాయకులు కోస్గి భగవద్గీత, కమ్మరి జనార్దన్‌చారి, యాదయ్య, జనార్దన్‌రెడ్డి, గోవింద్‌, రవి, గోవింద్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, లక్ష్మయ్య, బాల్‌రాజ్‌, వెంకటేష్‌, శ్రవణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-03T04:56:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising