ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

ABN, First Publish Date - 2021-11-03T04:55:41+05:30

గ్రామాల అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

అయ్యప్ప ఆలయ కమిటీ నిర్వాహకులకు వెండి, బంగారం బహూకరిస్తున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి


బషీరాబాద్‌: గ్రామాల అభివృద్ధి టీఆర్‌ఎస్‌ పార్టీతోనే సాధ్యమని తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి అన్నారు. బషీరాబాద్‌, కొర్విచెడ్‌ గ్రామాల్లో మంగళవారం మాజీ ఎమ్మెల్యే ఎం.నారాయణరావుతో కలిసి ఆయన పర్యటించారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. తన తాత కీర్తిశేషులు లింగారెడ్డి జ్ఞాపకార్థం సొంత ఖర్చులతో ఆలయ ప్రాంగణంలో ఎనిమిది దుకాణాల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని అయ్యప్ప ఆలయ నిర్వహణ, దూపదీప నైవేద్యాల ఖర్చులకు వినియోగించాలని సూచించారు. అదేవిధంగా ఆలయ కమిటీ నిర్వహకులు అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పంచలోహాలతో చేయిస్తుండగా ఎమ్మెల్యే తనవంతుగా కిలో వెండి, కొంత బంగారం ఆలయ కమిటీ నిర్వహకులకు స్వయంగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కొర్విచెడ్‌ గ్రామాన్ని సందర్శించగా గ్రామ నాయకులు, స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పైలట్‌రోహిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం.నారాయణరావు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమపథకాలను ప్రజలకు వివరించారు. గ్రామంలో అవసరమైన చోట సీసీ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. నవాంద్గీ పీఏసీఎస్‌ డైరెక్టర్‌ నవీన్‌రెడ్డి, యువజన సంఘం నాయకుడు శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు యువకులు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో తాండూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విఠల్‌నాయక్‌, పార్టీ సీనియర్‌ నాయకులు శ్రీశైల్‌రెడ్డి, ఇందర్‌చెడ్‌ రాజు, టీఆర్‌ఎస్‌ మండలపార్టీ అధ్యక్షుడు రామునాయక్‌, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు వడ్డె శ్రీనివాస్‌, నాయకులు పర్వత్‌పల్లి గోపాల్‌రెడ్డి, పవాన్‌ఠాగుర్‌, రాజరత్నం, వీరారెడ్డి, పాండురంగారెడ్డి, సాయిల్‌గౌడ్‌, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆలయ నిర్మాణానికి మంతన్‌గౌడ్‌ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు గోపాల్‌నాయక్‌ రూ.21వేల చెక్కును ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం.నారాయణరావు చేతుల మీదుగా ఆలయ కమిటీకి విరాళంగా అందజేశారు. అదేవిధంగా కాశీంపూర్‌ పాఠశాలను ఎమ్మెల్యే మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.  175 మంది విద్యార్థులకు ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నట్లు స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయన విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే  జిల్లా విద్యాధికారితో ఫోన్‌లో మాట్లాడి ఉపాధ్యాయులను నియమించాలని సూచించారు. దీపావళి పండగ తర్వాత ఉపాధ్యాయులను కేటాయిస్తానని డీఈవో చెప్పడంతో స్థానికులు హర్షం వ్యక్తంచేశారు. సర్పంచ్‌ వెంకటయ్య, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ బి.ఆర్‌.శ్రీనివాస్‌, మాలే శేఖర్‌, శ్రీను పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-03T04:55:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising