ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రమశిక్షణ తప్పి తాగుబోతు సీఎం మాటలు నిజం చేయొద్దు: రేవంత్

ABN, First Publish Date - 2021-11-09T17:40:58+05:30

ఎంత మంది నాయకులు పోయినా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గల్లీలో కార్యకర్తలు కష్టపడితేనే ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎంత మంది నాయకులు పోయినా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గల్లీలో కార్యకర్తలు కష్టపడితేనే ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు. రాష్ట్రాన్ని బీజేపీ, టీఆర్ఎస్ కలిసి దోచుకుంటున్నాయన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలూ తోడు దొంగలేనన్నారు. ఇంకా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. వరి వేస్తే ఉరే అని సీఎం సిగ్గు లేకుండా మాట్లాడుతోంది. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది. కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికే ఈ రెండు రోజుల సదస్సు. క్రమశిక్షణ కాంగ్రెస్‌లో ముఖ్యం. క్రమశిక్షణ తప్పి తాగుబోతు సీఎం మాటలు నిజం చేయొద్దు. మేము పదవులు అనుభవిస్తున్నాం అంటే కార్యకర్తల వల్లే. కష్టపడే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా.. సోనియమ్మ రాజ్యం కోసం కష్టపడే వారికి పదవులు, టికెట్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. తెలంగాణ తల్లి సీఎం ఫామ్ హౌజ్‌లో బందీ అయ్యింది. కల్వకుంట్ల కుటుంబం నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉంది. పార్టీలో పదవులు అనుభవించి పార్టీ మారిన వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం. కష్టపడే కార్యకర్తలను రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తా. కష్టపడని కార్యకర్తలపై జనవరి 26 తర్వాత నేనే చర్యలు తీసుకుంటా. సోనియమ్మ రాజ్యం కోసం.. రాబోయే 18 నెలలు దీక్ష తీసుకుని పని చేయాలి’’ అని పేర్కొన్నారు.



Updated Date - 2021-11-09T17:40:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising