ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీతక్క నాతో సరిసమానం: రేవంత్ రెడ్డి

ABN, First Publish Date - 2021-06-30T00:42:26+05:30

సీతక్క నాతో సరిసమానం: రేవంత్ రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీతక్క తనతో సరిసమానమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ‌గా ఎన్నికైన రేవంత్‌రెడ్డితో సీతక్క భేటీ అయి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీతక్కపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకటే కుర్చీ ఉంటే.. ఆ కుర్చీలో సీతక్కనే కూర్చో పెడతానని ఆయన వ్యాఖ్యానించారు. సీతక్క తనకు అండగా వుందని, రాబోయే రోజుల్లో రాష్ట్ర నలుమూలల తిరగాల్సి ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ తల్లి సోనియా గాంధేనని స్పష్టం చేశారు.


 ‘‘ నాకు పీసీసీ పదవీ వస్తదని నిఘా వర్గాల రిపోర్ట్ రాగానే.. ప్రగతి భవన్ తలుపులు తెరిచారు. ఖబర్దార్ కేసీఆర్.. నీ సంగతి చూస్తా. కరెంట్ తీగలా కాదు.. హై టెన్షన్ వైరులా కొట్లాడతాం. పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ, సీఐలకు పోస్టింగ్ ఇవ్వాలంటే లక్షల్లో వసూలు చేస్తున్నారు. టీఆరెస్ జెండా మోసిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సంతోషంగా ఉన్నారా?. గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. దిక్కులేక స్థానిక ప్రజాప్రతినిధులు బ్రోకర్లుగా, పైరవీకారులుగా మారుతున్నారు. లోకల్ లీడర్లు రోడ్లపై పడ్డారు. టీఆరెస్ స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా నిధులు లేక సొంత డబ్బులను ఖర్చు చేస్తున్నారు. టీఆరెస్ పాలనలో స్థానిక ప్రజా ప్రతినిధులకు విలువ లేకుండా పోయింది.’’ అని రేవంత్ రెడ్డి అన్నారు. 

Updated Date - 2021-06-30T00:42:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising