కారు ఢీకొట్టిన బాలుడు మృతి
ABN, First Publish Date - 2021-04-28T01:19:24+05:30
కారు ఢీకొట్టిన బాలుడు మృతి
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న 11 నెలల బాలుడిని కారు ఢీకొట్టింది. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతిచెందాడు. నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న 11 నెలల బాలుడు తోట జస్వంత్‌ను తాటి కిరణ్ అనే కారు డ్రైవర్ తన కారును అతివేగంగా వచ్చి డీ కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన బాలుడు జస్వంతను స్థానిక కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతికి కారణమైన కారు డ్రైవర్ తాటి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - 2021-04-28T01:19:24+05:30 IST