ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితుడికి సర్పంచ్‌ అంత్యక్రియలు

ABN, First Publish Date - 2021-05-02T05:59:25+05:30

కరోనా బాధితుడికి సర్పంచ్‌ అంత్యక్రియలు

అంబులెన్స్‌ నుంచి మృతదేహాన్ని తీస్తున్న సర్పంచ్‌ అశోక్‌, తిరుపతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సహకరించిన ఉప సర్పంచ్‌ భర్త, వార్డు సభ్యుడు

కాటారం, మే 1 : మండలంలోని శంకరంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బుడగజంగాల కాలనీకి చెందిన వ్యక్తి (42) శనివారం కరోనాతో మృతిచెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడవగా అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయన మృతదేహానికి సర్పంచ్‌ అంగజాల అశోక్‌కుమార్‌, ఉప సర్పంచ్‌ ముక్కెర రమ్యశ్రీ భర్త తిరుపతి, వార్డు సభ్యుడు టేకం సంతోష్‌ పీపీఈ కిట్లు ధరించి ఎక్స్‌కవేటర్‌తో గొయ్యి తీయించి మృతదేహాన్ని ఖననం చేశారు. ఆరు రోజుల క్రితం ఆ వ్యక్తి కాటారం పీహెచ్‌సీకి వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో రెండు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉన్న కరోనా బాధితుడికి శ్వాస సమస్య తలెత్తడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. శనివారం తెల్లవారుజామున తీవ్ర శ్వాసకోశ సమస్య ఏర్పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, బంధువులు అంబులెన్స్‌ను మాట్లాడి మృతదేహాన్ని ఇంటికి తరలిం చినప్పటికీ అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు. పంచాయతీ పాలకవర్గానికి సమాచారం ఇవ్వడంతో సర్పంచ్‌ అశోక్‌, ముక్కెర తిరుపతి, టేకం సంతోష్‌ వైద్యాధికారుల నుంచి పీపీఈ కిట్లు తీసుకుని మృతదేహానికి ఖననం చేసి ప్రజలతో శభాష్‌ అనిపిం చుకున్నారు మృతుడి కుటుంబ సభ్యులు దూ రం నుంచే కన్నీళ్లతో దండం పెట్టుకున్నారు.

Updated Date - 2021-05-02T05:59:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising