ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎస్ తో జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ఉపాధ్యక్షుడి భేటీ

ABN, First Publish Date - 2021-08-11T02:01:24+05:30

షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ (ఎన్ సి ఎస్ సి) ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్ మంగళవారం బి.ఆర్.కె.ఆర్. భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర డీజీపి మహేందర్ రెడ్డి ఇతర సీనియర్ అధికారులతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ (ఎన్ సి ఎస్ సి) ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్ మంగళవారం బి.ఆర్.కె.ఆర్. భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర డీజీపి మహేందర్ రెడ్డి ఇతర సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. ఏదైన సంఘటన జరిగిన వెంటనే స్పందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆయన అధికారులకు సూచించారు. మానవతా దృక్పథంతో ఎస్సీల సంక్షేమానికి కృషి చేయాలని అరుణ్ హల్దార్ అధికారులను కోరారు.


షెడ్యూల్డ్ కులాల సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆయనకు వివరించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి చట్టాన్ని అమలు చేస్తోంది, దేశంలో ఇలాంటి చట్టం తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని  ప్రధాన కార్యదర్శి తెలిపారు. జనాభా నిష్పత్తి ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌లో 15.45% నిధులను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కేటాయించబడింది. ఈ నిధులలో ఖర్చు చేయని సోమ్ము మరుసటి సంవత్సరం నిధులకు అదనంగా జమఅవుతుందని తెలిపారు. జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో నోడల్ కమిటీల ద్వారా షెడ్యూల్డ్ కులాలపై జరిగే అట్రాసిటి కేసులను మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు.


ప్రభుత్వ ప్లాగ్ షిప్ కార్యక్రమంలో భాగంగా, షెడ్యూల్ కులాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు ప్రభుత్వం రెసిడెన్షియల్ విద్యా సంస్థలను నడుపుతోందని సీఎస్ తెలిపారు. ఇక్కడ అందించిన మెరుగైన నాణ్యత విద్యా కారణంగా అనేక మంది విద్యార్థులు దేశ, విదేశాలలో అత్యున్నత ఉన్నత విద్యాసంస్థలతో ప్రవేశాలు పొందారని అన్నారు.షెడ్యూల్డ్ కులాల వారిపై జరిగిన అట్రాసిటి కేసులను పరిష్కరించడంలో ప్రభుత్వ నిబద్ధతను అధికారులు వివరించారు, రాష్ట్రంలో ఇటీవల జరిగిన మరియమ్మ కేసు సంఘటను వివరించారు. భాదిత కుటుంబానికి ఉపశమనంతో పాటు, మరియమ్మ కుమారునికి ఉపాధి కల్పించినట్టు తెలిపారు. 

Updated Date - 2021-08-11T02:01:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising