ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీరియల్‌ కిల్లర్‌ రాములు అరెస్టు

ABN, First Publish Date - 2021-01-27T08:12:18+05:30

కల్లు కాంపౌండ్లే అతడి అడ్డా.. ఒంటరిగా కనిపించే మహిళలే టార్గెట్‌.. వారిపై కసితో రగిలిపోతాడు.. మాయమాటలతో మభ్యపెడతాడు.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్తాడు.. విచక్షణారహితంగా దాడిచేసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్య పారిపోవడంతో.. మహిళలపై కసి.. కల్లు కాంపౌండ్ల వద్ద ఒంటరి మహిళలే టార్గెట్‌

ఇప్పటి వరకు 18 హత్యలు.. ఒకసారి జీవిత ఖైదు

మానసిక ఆస్పత్రిలో చికిత్స.. అక్కడి నుంచి పరారీ

కోర్టు క్షమాభిక్షతో విడుదల.. మళ్లీ హత్యల బాట


హైదరాబాద్‌ సిటీ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): కల్లు కాంపౌండ్లే అతడి అడ్డా.. ఒంటరిగా కనిపించే మహిళలే టార్గెట్‌.. వారిపై కసితో రగిలిపోతాడు.. మాయమాటలతో మభ్యపెడతాడు.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్తాడు.. విచక్షణారహితంగా దాడిచేసి, చంపేస్తాడు..! ఇలా 18 హత్యలు చేసిన సీరియల్‌ కిల్లర్‌ రాములును హైదరాబాద్‌, రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. గత నెల జరిగిన ఇద్దరు మహిళల హత్య కేసులో.. రాములుకు బేడీలు వేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం , ఆరుట్ల గ్రామానికి చెందిన మైనా రాములు(45) లేబర్‌గా పని చేసేవాడు. 21 ఏళ్ల వయసులో అతడికి పెళ్లయింది. కొంతకాలానికే అతడి భార్య వేరే వ్యక్తితో పారిపోయింది. అప్పటి నుంచి అతడు మహిళలంటే కసి పెంచుకున్నాడు. వారిని చూస్తే రగిలిపోయేవాడు. తన భార్య చేసిన మోసాన్ని తల్చుకుంటూ.. ఆ కోపాన్ని వారిపై తీర్చుకుని.. హతమార్చేవాడు. 20 ఏళ్ల క్రితం నగరంలోని బోరబండకు మకాం మార్చిన రాములు.. 2003లో తూప్రా న్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఓ మహిళను హతమార్చాడు. 2004 నుంచి సీరియల్‌ కిల్లర్‌గా రెచ్చిపోయాడు. అలా ఇప్పటి వరకు 18 హత్యలు, ఆరు దోపిడీలు చేశారు.


ఇలా దొరికాడు..

జూబ్లీహిల్స్‌ వెంకటగిరి కాలనీకి చెందిన అనంతయ్య.. తన భార్య వెంకటమ్మ(50) మూడు రోజులుగా కనిపించడం లేదంటూ ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సుమారు 500 సీసీ కెమెరాల ఫుటేజీని జల్లెడ పట్టారు. యూసు్‌ఫగూడ నుంచి ఆమెను ఓ వ్యక్తి  ఘట్‌కేసర్‌కు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఫుటేజీ ద్వారా.. ఆమెను తీసుకెళ్లింది సీరియల్‌ కిల్లర్‌ రాములుగా నిర్ధారించుకున్నారు. దాంతో.. హైదరాబాద్‌ ఉత్తర మండలం, టాస్క్‌ఫోర్స్‌, రాచకొండ పోలీసులు రాములు కోసం వేట ప్రారంభించారు. మంగళవారం అతడిని అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తులో.. వెంకటగిరి కల్లుకాంపౌండ్‌ నుంచి వెంకటమ్మను తాను ఘట్‌కేసర్‌ తీసుకెళ్లినట్లు.. అక్కడ ఆమెను హతమార్చినట్లు అంగీకరించాడు. ఆ తర్వాత ఆమె ఒంటిపై నగలను తస్కరించినట్లు చెప్పాడు. అంతే కాకుండా.. గత నెల 10న బాలానగర్‌ కల్లుకాంపౌండ్‌ నుంచి ఓ మహిళ(40)ను తీసుకెళ్లి సిద్దిపేట జిల్లా ములుగులోని జప్తాసింగాయపల్లి శివార్లలో హతమార్చినట్లు వెల్లడించాడు. చీరతో ఆ మహిళకు ఉరివేసి, ఒంటిపై నగలను తస్కరించినట్లు చెప్పాడు.


జీవిత ఖైదు విధించినా..

సైబరాబాద్‌ కమిషనరేట్‌ నార్సింగ్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో 2009లో జరిగిన హత్య కేసుతోపాటు.. ఓ దోపిడీ కేసులో రాములుకు రంగారెడ్డి జిల్లా నాలుగో అదనపు సెష న్స్‌ కోర్టు జడ్డి 2011 ఫిబ్రవరి 21న జీవితఖైదు విధించారు. జైలులో అతడి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో 2011 డిసెంబరు 1న ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయంలో చేర్చారు. అదేనెల 30న అతడు ఎస్కార్ట్‌ పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. దీనిపై ఎస్‌ఆర్‌నగర్‌ పీఎస్‌లో కేసు ఉంది. రాములు ఆ తర్వాత బోయిన్‌పల్లి, చందానగర్‌, దుండిగల్‌ పీఎస్‌ల పరిధుల్లో 5 హత్యలు చేశాడు. 2013 మే13న బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఐదేళ్లపాటు జైల్లో ఉన్న రాములు.. జీవితఖైదుకు సంబంధించి హైకోర్టులో అప్పీల్‌ చేసుకున్నాడు. 2018 అక్టోబరు 3న కోర్టు అతడికి క్షమాభిక్ష ప్రసాదించింది. ఆ తర్వాతా అతనిలో మార్పు రాలేదు. షామీర్‌పేట్‌, పటాన్‌చెరుల్లో ఇద్దరు మహిళలను హతమార్చాడు. ఈ కేసుల్లో గత ఏడాది జూలై 31న చర్లపల్లి జైలు నుంచి విడులయ్యాడు. డిసెంబరులో ఇద్దరు మహిళల్ని పొట్టనబెట్టుకున్నాడు.

Updated Date - 2021-01-27T08:12:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising