ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల్లో నాగుపాముల హల్‌చల్‌

ABN, First Publish Date - 2021-08-27T06:20:08+05:30

పాఠశాలల్లో నాగుపాముల హల్‌చల్‌

వంచనగిరిలో పాఠశాలలో..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గీసుగొండ, ఆగస్టు 26: పాఠ శాలలు పునఃప్రారంభం కాబో తున్న నేపథ్యంలో పాఠశాలలో తరగతి గదులను శుభ్రం గురు వారం చేస్తుండగా నాగు పాము ప్రత్యక్షమైంది. దీంతో గ్రామపం చాయతీ సిబ్బంది హడలిపో యారు. స్టాప్‌రూంలోని చెక్కబాక్స్‌ కింద దూరిన పాము బయటికి వచ్చి గంటపాటు పడగవిప్పి బుసలు కొడుతుంటే స్థానికులు భయాందోళన చెందారు. హెచ్‌ఎం ముత్యాలు పాములు పట్టేవారిని పిలిపించి పాము ను పట్టించారు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.   

చెన్నారావుపేట: పాపయ్యపేట జడ్పీహైస్కూల్‌లో గురువారం నాగుపాము కనబడడంతో వణికిపోయారు. గదులను శుభ్రం చేసేందుకు జీపీ సిబ్బంది జన్ను శ్రీను, యాకయ్యలతోపాటు పాఠశాల చైర్మన్‌ జాటోతు యాకుబ్‌లు వెళ్లారు. నాగుపాము ఓ గదిలో పడగ విప్పి, బుసలు కొడుతూ కనిపించడంతో కంగారుపడ్డారు. రెండున్నర గంట లపాటు గదిలో ఉండి ఇబ్బంది పెట్టింది. చివరకు పెద్ద కర్రలతో గదిలో నుంచి పామును పంట పొలాల్లోనికి పంపించారు. 




Updated Date - 2021-08-27T06:20:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising