నేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సెలవు
ABN, First Publish Date - 2021-03-14T12:39:30+05:30
ఈ నెల 14వ తేదీ ఆదివారం ఎన్నికలు జరిగే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేయవని, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేపట్టబోరని ప్రభుత్వం...
హైదరాబాద్: ఈ నెల 14వ తేదీ ఆదివారం ఎన్నికలు జరిగే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేయవని, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేపట్టబోరని ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వస్తున్నందున రెండో శనివారం, ఆదివారాలు కూడా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేస్తాయని 10 రోజుల కిందట ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 11న మహాశివరాత్రి, 29న హోలీ పండుగలు మినహా, 7న ఆదివారం, 13న రెండో శనివారం, 14, 21, 28 తేదీలలో ఆదివారాల్లో కూడా కార్యాలయాలు పని చేస్తాయని, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రకటించింది. అయితే 14న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నందున హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆ రోజు సెలవు ప్రకటించింది. తహసిల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని వివరించింది. ధరణి పోర్టల్‌లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం ద్వారా రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుందని తెలిపింది.
Updated Date - 2021-03-14T12:39:30+05:30 IST