గ్రాడ్యుయేట్ ఓటర్లు మంచి చెడులను విశ్లేషించుకుని ఓటువేయాలి
ABN, First Publish Date - 2021-02-28T21:57:07+05:30
వరంగల్ ఖమ్మం నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం టీఆరెఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం కోసం వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని పట్టభద్రులు,
వరంగల్: వరంగల్ ఖమ్మం నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం టీఆరెఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం కోసం వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని పట్టభద్రులు, పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో వరంగల్ సీకేఎం కాలేజీ మైదానం లో సమావేశం ఆదివారం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ లు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, టీఆరెఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జి గ్యాదరి బాల మల్లు, మేయర్ గుండా ప్రకాష్ రావు, మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మాజీ ఎంపీ గుండు సుధారాణి, పలువురు నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాటాడుతూ గ్రాడ్యుయేట్ ఓటర్లు మంచి చెడులను విశ్లేషించుకోవాలని కోరారు.సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్నది, కేంద్రం లో మోడీ ప్రభుత్వం చేస్తున్నది అర్థం చేసుకోవాలి.కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలతో పేద వాళ్ల మేనమామ గా ఉన్నది సీఎం కెసిఆర్ అని ఆయన తెలిపారు. 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ చెప్పింది ఇచ్చిందా?ప్రతి ఖాతాలో 15లక్షలు పడ్డాయా?పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గినయా?కంపెనీలు అన్ని అదానీ, అంబానీ లకు అమ్ముతున్నారని ఆరోపించారు.తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి అద్భుతంగా జరుగుతున్నదని అన్నారు.
బోయినపల్లి వినోద్ కుమార్ మాటాడుతూ భారత దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్న సందర్భం ఎప్పుడూ ఏ రాష్ట్రానికి రాలేదు. ఈ ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కిందని అన్నారు. భారత దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్న సందర్భం ఎప్పుడూ ఏ రాష్ట్రానికి రాలేదు. ఈ ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కిందని తెలిపారు. టీఆరెఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కే ఓటు వేయాలని పిలుపునిచారు. నాడు గొంతు ఎండిన తెలంగాణ... నేడు కోటి ఎకరాల సస్యశ్యామల మాగాణ గా మారింది.మన నిధులు మన అభివృద్ధికి, మన సంక్షేమానికి దోహద పడుతున్నాయి
అందుకే, మన రాష్ట్రం సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. 40 లక్షల మందికి పెన్షన్లు, 60లక్షల మందికి రైతు బంధు, పేదింటి ప్రతి పెళ్లి కి లక్షా 1వెయ్యి, 116, ప్రసూతి కి వెళ్ళే ప్రతి ఆడబిడ్డకు 12 వేలు అందిస్తున్న కెసిఆర్ కిట్లు ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? ఆయన సవాల్ విసిరారు. మనం సుసంపన్నంగా ఉన్నాం. మన నిధులు మనం మన అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేసుకుంటున్నామని వినోద్ కుమార్ తెలిపారు.
Updated Date - 2021-02-28T21:57:07+05:30 IST