ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ ఒక్కరికి కరోనా పరీక్షలు చేయాలి

ABN, First Publish Date - 2021-07-15T05:52:18+05:30

ప్రతీ ఒక్కరికి కరోనా పరీక్షలు చేయాలి

లక్ష్మీపూర్‌ గ్రామాన్ని సందర్శించిన డీఎంహెచ్‌వో లలితాదేవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  డీఎంహెచ్‌వో లలితాదేవి

కమలాపూర్‌, జూలై 14 : మండలంలోని లక్ష్మీపూర్‌ గ్రామంలోని ప్రతీ ఒక్కరికి కరోనా పరీక్షలు చేయాలని డీఎంహెచ్‌వో లలితాదేవి సూచించారు. మండలంలోని లక్ష్మీపూర్‌ గ్రామంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో బుధవారం  గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో మూడు రోజులలో సుమారు 42 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్థారణ కావడంతో  కేసులు ఎక్కువగా నమోదు కావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారందరూ హోం ఐసోలేషన్‌లోనే ఉండాలని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌ హర్షిణి ప్రియ, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గ్రామంలో 10 రోజుల లాక్‌ డౌన్‌

కమలాపూర్‌ మండలంలోని లక్ష్మీపూర్‌ గ్రామంలో 10 రోజుల లాక్‌ డౌన్‌ అమలు చేయనున్నట్టు గ్రామ సర్పంచ్‌ సీహెచ్‌ వనిత బుధవారం  తెలిపారు. గ్రామంలో కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కఠినంగా లాక్‌ డౌన్‌ అమలు చేసేందుకు గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందని, ప్రజలందరు మాస్క్‌లు ధరించాలని, కొవిడ్‌  నిబంధనలు పాటించాలని సూచించారు. కాగా, కమలాపూర్‌ మండలంలోని ఉప్పల్‌, కమలాపూర్‌ పీహెచ్‌సీ పరిధిలోని అంబాల, లక్ష్మీపూర్‌, మర్రిపల్లిగూడెం, వంగపల్లి, భీంపల్లి గ్రామాలలో బుధవారం 24 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని వైద్యులు తెలిపారు.

Updated Date - 2021-07-15T05:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising