ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలంటూ ఓ యువకుడు..

ABN, First Publish Date - 2021-06-06T23:05:48+05:30

ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలంటూ ఓ యువకుడు నానా హంగామా చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్ జిల్లా: ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలంటూ ఓ యువకుడు నానా హంగామా చేశాడు. వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేశాడు. బీర్ సీసాతో తలపై మోదుకుంటూ బెదిరింపులకు దిగాడు. వికారాబాద్ జిల్లా, దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దోమ మండలం, ఖమ్మం నాచారం గ్రామానికి చెందిన వినోద్‌కు గజ్వేల్‌కు చెందిన యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. రెండు రోజుల క్రితం యువతని పెళ్లి చేసుకుంటానని ఆమెను తన ఇంటికి తీసుకువచ్చాడు. దీంతో యువకుడి కుటుంబ సభ్యులు యువతి తల్లిదండ్రులను పిలిపించి ఆమెను పంపించారు. అయితే తన ప్రియురాలు తనకు దూరం అవుతుందన్న బాధతో వినోద్ మద్యం సేవించి గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకుడిని బుజ్జగించి కిందికి దించి పీఎస్‌కు తరలించారు. కుటుంబసభ్యుల సమక్షంలో అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

Updated Date - 2021-06-06T23:05:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising