ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేద్కర్ పేరు పెట్టడం.. సీఎం సార్‌కు ఇష్టం లేదు: షర్మిల

ABN, First Publish Date - 2021-04-14T21:21:30+05:30

దళిత వ్యక్తిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి.. సీఎం కేసీఆర్ మోసం చేశారని వైఎస్ షర్మిల విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దళితులను ముఖ్యమంత్రి చెయ్యాలని ఏ దళితుడూ అడగలేక పోతున్నారని, దళిత వ్యక్తిని తెలంగాణకు తొలి సీఎం చేస్తానని చెప్పి.. ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని వైఎస్ షర్మిల విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా బుధవారం లోటస్ పాండ్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ మూడు ఎకరాల భూమి ఏమయ్యిందో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. చేవెళ్ల-ప్రాణహితకి దివంగత వైఎస్సార్ అంబేద్కర్ పేరు పెట్టారన్నారు. ఇప్పటి కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి అంబేద్కర్ పేరు పెట్టలేక పోతున్నారని విమర్శించారు. నాగార్జున సాగర్ ఎన్నికలకు కొవిడ్ నిబంధనలు అడ్డు రావు.. అంబేద్కర్ జయంతి ఘనంగా చేయడానికి మాత్రం నిబంధనలు అడ్డు వస్తాయా? అని ప్రశ్నించారు. దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్యపై ఒక ఆరోపణ రాగానే వెంటనే ఆయనను తొలగించారని, ఎన్నో ఆరోపణలు వస్తున్న మల్లారెడ్డిపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని షర్మిల విమర్శించారు.



Updated Date - 2021-04-14T21:21:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising