ఆమ్ పన్నా
ABN, First Publish Date - 2021-04-03T18:03:53+05:30
పచ్చి మామిడికాయలు - రెండు, పంచదార - కొద్దిగా, ఉప్పు - ఒక టీస్పూన్, బ్లాక్ రాక్ సాల్ట్ - రెండు టీస్పూన్లు, జీలకర్రపొడి - రెండు టీస్పూన్లు, పుదీనా ఆకులు - కొన్ని, ఐస్‌క్యూబ్స్ - తగినన్ని.
పచ్చిమామిడికాయలతో చేసే ఈ డ్రింక్‌ను ఒక్కసారి రుచిచూస్తే మళ్లీమళ్లీ తాగుతారు. ఆమ్ పన్నాను ఎలా తయారుచేయాలంటే...
కావలసినవి: పచ్చి మామిడికాయలు - రెండు, పంచదార - కొద్దిగా, ఉప్పు - ఒక టీస్పూన్, బ్లాక్ రాక్ సాల్ట్ - రెండు టీస్పూన్లు, జీలకర్రపొడి - రెండు టీస్పూన్లు, పుదీనా ఆకులు - కొన్ని, ఐస్‌క్యూబ్స్ - తగినన్ని.
తయారీ విధానం: మామిడికాయల లోపలి భాగం మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చల్లారిన తరువాత మామిడికాయల తొక్క తీసి, లోపలి భాగాన్ని గుజ్జుగా చేయాలి. ఇప్పుడు మిక్సీలో మామిడికాయ గుజ్జు వేసి, పంచదార, ఉప్పు, బ్లాక్ రాక్‌సాల్ట్, జీలకర్రపొడి వేసి బ్లెండ్ చేసుకోవాలి. పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకుని, ఐస్‌క్యూబ్స్ వేసి చల్లగా ఉండగానే తాగాలి.
Updated Date - 2021-04-03T18:03:53+05:30 IST