almond, బేసన్ లడ్డూ
ABN, First Publish Date - 2021-07-22T18:35:56+05:30
శనగ పిండి- కప్పు, రవ్వ- అర కప్పు, చక్కెర- అర కప్పు, నెయ్యి- ముప్పావు కప్పు, బాదం- అర కప్పు, యాలకుల పొడి- అర స్పూను.
కావలసిన పదార్థాలు: శనగ పిండి- కప్పు, రవ్వ- అర కప్పు, చక్కెర- అర కప్పు, నెయ్యి- ముప్పావు కప్పు, బాదం- అర కప్పు, యాలకుల పొడి- అర స్పూను.
తయారుచేసే విధానం: ఓ బాణలిలో నెయ్యి వేసి బాదం పలుకులను వేయించాలి. ఇవి చల్లారాక మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. మరో మందపాటి బాణలిలో నెయ్యి వేసి కాగాక శనగ పిండి, రవ్వ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తరవాత బాదం పొడిని కూడా కలిపి వేయించి పక్కన పెట్టాలి. కాస్త చల్లారాక ఇందులో యాలకుల పొడి, చక్కెర కూడా వేసి బాగా కలిపి కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు కడితే సరి. ఒక్కో లడ్డూపై బాదం పలుకులు అలంకరిస్తే అందంగా ఉంటుంది.
Updated Date - 2021-07-22T18:35:56+05:30 IST