బాదం హల్వా
ABN, First Publish Date - 2021-12-08T19:31:40+05:30
బాదం పప్పు - అర కప్పు, పాలు - పావు కప్పు, చక్కెర - పావు కప్పు, నెయ్యి- రెండు స్పూన్లు, కుంకుమ పువ్వు పాలు - రెండు స్పూన్లు, యాలకుల పొడి - పావు స్పూను, డ్రై ఫ్రూట్స్ ముక్కలు- కొన్ని.
కావలసిన పదార్థాలు: బాదం పప్పు - అర కప్పు, పాలు - పావు కప్పు, చక్కెర - పావు కప్పు, నెయ్యి- రెండు స్పూన్లు, కుంకుమ పువ్వు పాలు - రెండు స్పూన్లు, యాలకుల పొడి - పావు స్పూను, డ్రై ఫ్రూట్స్ ముక్కలు- కొన్ని.
తయారుచేసే విధానం: మొదట బాదం పప్పును అరగంట పాటు నీళ్లలో నానబెట్టాలి. పొట్టు తీసి మిక్సీలో పొడి చేయాలి. అందులోనే పాలనూ చేర్చి పేస్టులా చేసుకోవాలి. పెద్ద పాన్‌లో నెయ్యి వేసి ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద ఉడికించాలి. దీనికి చక్కెరనూ జతచేసి కరిగేలా కలుపుతూ ఉండాలి. కాచిన పాలలో కుంకుమ పువ్వును పది నిమిషాలు నానబెట్టాలి. ఆ పాలను ఇందులో కలపాలి. మిశ్రమమంతా దగ్గరవుతున్నప్పుడు నెయ్యి కలపాలి. యాలకుల పొడి కూడా వేసి బాగా కలిపి దించితే బాదం హల్వా రెడీ. పైన డ్రై ఫ్రూట్స్ పలుకులు అలంకరిస్తే బాగుంటుంది.
Updated Date - 2021-12-08T19:31:40+05:30 IST