అప్రికాట్ పుడ్డింగ్
ABN, First Publish Date - 2021-08-22T18:56:03+05:30
డ్రై అప్రికాట్స్ - 200గ్రా, బిస్కట్ల పొడి - 50గ్రా, స్పాంజి కేకు పొడి - 50గ్రా, పాలు - 200ఎం.ఎల్, పంచదార - 50గ్రా, విప్ప్‌డ్ క్రీమ్ - 30గ్రా, చెర్రీలు - నాలుగైదు, పుదీనా ఆకులు - కొద్దిగా, జామ్ - ఒక టేబుల్‌స్పూన్.
కావలసినవి: డ్రై అప్రికాట్స్ - 200గ్రా, బిస్కట్ల పొడి - 50గ్రా, స్పాంజి కేకు పొడి - 50గ్రా, పాలు - 200ఎం.ఎల్, పంచదార - 50గ్రా, విప్ప్‌డ్ క్రీమ్ - 30గ్రా, చెర్రీలు - నాలుగైదు, పుదీనా ఆకులు - కొద్దిగా, జామ్ - ఒక టేబుల్‌స్పూన్.
తయారీ విధానం: ఒక బౌల్ తీసుకుని అందులో పాలు పోసి, బిస్కట్ల పొడి, స్పాంజి కేకు పొడి, పంచదార వేసి కలుపుకోవాలి. మరొక డెజర్ట్ బౌల్ తీసుకుని అందులో డ్రై అప్రికాట్స్‌ను ముక్కలుగా చేసి లేయర్‌లా పరుచుకోవాలి. వాటిపై బిస్కట్ల పొడి మిశ్రమాన్ని లేయర్ వేయాలి. ఇప్పుడు వాటిపై విప్ప్‌డ్ క్రీమ్‌ను లేయర్‌లా వేసుకోవాలి. చెర్రీలు, పుదీనా ఆకులు, జామ్‌తో గార్నిష్ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2021-08-22T18:56:03+05:30 IST