ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీట్‌రూట్‌ హల్వా

ABN, First Publish Date - 2021-10-30T18:16:39+05:30

దీపావళి పండుగ రోజున టపాసులు కాల్చడం, స్వీటుతో నోరు తీపి చేసుకోవడం అందరూ చేసేదే. అయితే ఈసారి కాస్త భిన్నంగా హల్వాతో వేడుక చేసుకుందాం!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హల్వాతో వేడుక

దీపావళి పండుగ రోజున టపాసులు కాల్చడం, స్వీటుతో నోరు తీపి చేసుకోవడం అందరూ చేసేదే. అయితే ఈసారి కాస్త భిన్నంగా హల్వాతో వేడుక చేసుకుందాం! 


కావలసినవి: బీట్‌రూట్‌ - 200గ్రాములు, కోవా - 50గ్రాములు, జీడిపప్పు - 15గ్రాములు, పంచదార - 150గ్రాములు, నెయ్యి - 20గ్రాములు, ఎండుద్రాక్ష - 10గ్రాములు, బాదం - 10గ్రాములు, యాలకులు - 10గ్రాములు.


తయారీ విధానం: బీట్‌రూట్‌ పొట్టు తీసి సన్నగా తరగాలి. స్టవ్‌పై కడాయి పెట్టి నెయ్యి వేసి వేడి అయ్యాక బీట్‌రూట్‌ తురుము వేసి వేగించాలి. బాగా వేగిన తరువాత పంచదార, కోవా వేసి మరో మూడు నిమిషాల పాటు వేగించుకోవాలి. తరువాత కొన్ని బాదం పలుకులు, జీడిపప్పు, యాలకుల పొడి వేసి మరికాసేపు వేగనివ్వాలి. చివరగా బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-10-30T18:16:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising