కొబ్బరి హల్వా
ABN, First Publish Date - 2021-01-01T19:15:47+05:30
కొబ్బరి తురుము - 2 కప్పులు, బెల్లం పొడి - ఒక కప్పు, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి - అర టీ స్పూను, జీడిపప్పు - 15.
కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము - 2 కప్పులు, బెల్లం పొడి - ఒక కప్పు, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి - అర టీ స్పూను, జీడిపప్పు - 15.
తయారుచేసే విధానం: మిక్సీలో కొబ్బరి తురుము, బెల్లం వేసి కొద్దిగా నీరు పోసి ముద్దగా, మెత్తగా రుబ్బుకోవాలి. కడాయిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు వేగించి పక్కనుంచాలి. అదే కడాయిలో కొబ్బరి మిశ్రమం వేసి ముద్దగా అయ్యేవరకు కనీసం 30 నిమిషాలు చిన్నమంటపై కలుపుతూ ఉడికించాలి. తర్వాత యాలకుల పొడి, జీడిపప్పు, అర టేబుల్ స్పూను నెయ్యి వేసి దించేయాలి.
Updated Date - 2021-01-01T19:15:47+05:30 IST