కద్దూ కా హల్వా
ABN, First Publish Date - 2021-10-30T18:26:43+05:30
కద్దూ(సొరకాయ) - 500గ్రాములు, పాలు - 200ఎంఎల్, పంచదార - 200గ్రాములు, నెయ్యి - 50గ్రాములు
కావలసినవి: కద్దూ(సొరకాయ) - 500గ్రాములు, పాలు - 200ఎంఎల్, పంచదార - 200గ్రాములు, నెయ్యి - 50గ్రాములు, యాలకులు - 10గ్రాములు, ఎండుద్రాక్ష - 10గ్రాములు, జీడిపప్పు - 10గ్రాములు, కోవా - 150గ్రాములు.
తయారీ విధానం: స్టవ్‌పై కడాయి పెట్టి పాలు పోసి మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో కద్దూ తురుము వేయాలి. మెత్తగా ఉడికిన తరువాత కోవా, నెయ్యి, పంచదార వేసి కలపాలి. మరికాసేపు ఉడికించిన తరువాత కొన్ని జీడిపప్పు పలుకులు, యాలకుల పొడి వేయాలి. చివరగా మిగిలిన జీడిపప్పు, ఎండుద్రాక్షతో అలంకరించుకుని టేస్ట్ చేయాలి.
Updated Date - 2021-10-30T18:26:43+05:30 IST