ఖీర్
ABN, First Publish Date - 2021-10-02T18:18:32+05:30
టోన్డ్ పాలు - లీటరు, సీతాఫలం గుజ్జు - ఒక కప్పు, బియ్యం - అరకప్పు(ఒక గంటపాటు నానబెట్టాలి), పంచదార - తగినంత, జీడిపప్పు - నాలుగైదు పలుకులు, ఎండుద్రాక్ష - పది, యాలకుల పొడి - చిటికెడు.
కావలసినవి: టోన్డ్ పాలు - లీటరు, సీతాఫలం గుజ్జు - ఒక కప్పు, బియ్యం - అరకప్పు(ఒక గంటపాటు నానబెట్టాలి), పంచదార - తగినంత, జీడిపప్పు - నాలుగైదు పలుకులు, ఎండుద్రాక్ష - పది, యాలకుల పొడి - చిటికెడు.
తయారీ విధానం: స్టవ్‌పై పాత్రను పెట్టి పాలు పోసి మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో నానబెట్టిన బియ్యం వేయాలి. కొద్దిసేపు కలియబెట్టాలి. బియ్యం ఉడికిన తరువాత పంచదార, యాలకుల పొడి వేయాలి. పంచదార కరిగిన తరువాత సీతాఫలం గుజ్జు వేసి కలపాలి. మరో ఐదు నిమిషాలు ఉడికించుకుని సర్వింగ్ బౌల్‌లోకి మార్చుకోవాలి. జీడిపప్పు, ఎండుద్రాక్షతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2021-10-02T18:18:32+05:30 IST