పాల పోహా
ABN, First Publish Date - 2021-08-19T17:55:32+05:30
మందం అటుకులు- అర కప్పు, పాలు - కప్పు, డేట్స్ సిరప్ - రెండు స్పూన్లు, కొబ్బరి తురుము- రెండు స్పూన్లు, ఎండు ద్రాక్ష- పది, నట్స్ ముక్కలు- రెండు స్పూన్లు.
కావలసిన పదార్థాలు: మందం అటుకులు- అర కప్పు, పాలు - కప్పు, డేట్స్ సిరప్ - రెండు స్పూన్లు, కొబ్బరి తురుము- రెండు స్పూన్లు, ఎండు ద్రాక్ష- పది, నట్స్ ముక్కలు- రెండు స్పూన్లు.
తయారుచేసే విధానం: పాలను మరిగించి చల్లబడేలా చూడాలి. మందం అటుకుల్ని రెండు సార్లు నీళ్లలో కడిగి ఓ పాత్రలోకి తీసుకోవాలి. ఇందులో డేట్స్ సిరప్, కొబ్బరి తురుము వేసి కలపాలి. ఆ తరవాత పాలు, ఎండు ద్రాక్ష, నట్స్ ముక్కల్ని వేసి బాగా కలిపి రెండు నిమిషాలు అలాగే ఉంచితే పాల పోహా రెడీ.
Updated Date - 2021-08-19T17:55:32+05:30 IST