ఎండుఫలం మిల్క్‌షేక్
ABN, First Publish Date - 2021-05-28T14:37:56+05:30
బాదం పప్పు, కాజు, కిస్మిస్, పిస్తా- ఒక్కోటీ పాపు కప్పు, ఖర్జూరాలు- ఎనిమిది, అంజీర్- నాలుగు, కుంకుమపువ్వు- చిటికెడు, సోయా పాలు- రెండున్నర కప్పులు (చల్లవి), బాదం, కాజూ, పిస్తా
కావలసిన పదార్థాలు: బాదం పప్పు, కాజు, కిస్మిస్, పిస్తా- ఒక్కోటీ పాపు కప్పు, ఖర్జూరాలు- ఎనిమిది, అంజీర్- నాలుగు, కుంకుమపువ్వు- చిటికెడు, సోయా పాలు- రెండున్నర కప్పులు (చల్లవి), బాదం, కాజూ, పిస్తా ముక్కలు- ఓ స్పూను, చక్కెర- కావలసినంత.
తయారుచేసే విధానం: ముందుగా అంజీరను వేడి నీళ్లలో అర గంట నానబెట్టాలి. బాదం, కాజూలను కాసేపు నీళ్లలో నానబెట్టాలి. అంజీర్, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, మిగతా పప్పులన్నిటినీ వేసి గ్రైండ్ చేయాలి. దీనికి పావు కప్పు సోయా పాలు, కుంకుమపువ్వు కలిపి ఇంకోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిగతా రెండు కప్పుల పాలు, పంచదారను కూడా కలిపి మళ్లీ గ్రైండ్ చేయాలి. దీన్ని పొడవాటి గాజు గ్లాసులో పోసి పైన బాదం, కాజూ, పిస్తా ముక్కల్ని వేసి అందంగా తీర్చిదిద్దితే డ్రైఫ్రూట్స్ మిల్క్‌షేక్ రెడీ.
Updated Date - 2021-05-28T14:37:56+05:30 IST