ఖర్బూజ బర్ఫీ
ABN, First Publish Date - 2021-03-20T18:45:11+05:30
ముందుగా ఖర్బూజ గింజలను మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టాలి. స్టవ్‌పై పాత్ర పెట్టి అరకప్పు నీళ్లు పోసి, పంచదార వేసి చిన్నమంటపై మరిగించాలి. పంచదార పానకం చిక్కబడిన తరువాత ఖర్బూజ గింజల పొడి చల్లాలి. పొడి చల్లుతున్న
కావలసినవి: ఖర్బూజ గింజలు - ఒక కప్పు, పంచదార - ఒక కప్పు, నెయ్యి - పావు కప్పు, నీళ్లు - అరకప్పు.
తయారీ విధానం: ముందుగా ఖర్బూజ గింజలను మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టాలి. స్టవ్‌పై పాత్ర పెట్టి అరకప్పు నీళ్లు పోసి, పంచదార వేసి చిన్నమంటపై మరిగించాలి. పంచదార పానకం చిక్కబడిన తరువాత ఖర్బూజ గింజల పొడి చల్లాలి. పొడి చల్లుతున్న సమయంలో ఉండలు లేకుండా ఉండటం కోసం కలియబెడుతూ ఉండాలి. కొద్ది కొద్దిగా నెయ్యి వేయాలి. మిశ్రమం బాగా చిక్కబడిన తరువాత నెయ్యి రాసిన ప్లేట్‌లోకి మార్చుకోవాలి. తరువాత మీకు నచ్చిన ఆకారాల్లో కట్ చేయాలి. అంతే... తియ్యని ఖర్బూజ బర్ఫీ రెడీ.
Updated Date - 2021-03-20T18:45:11+05:30 IST