నువ్వుల అప్పాలు
ABN, First Publish Date - 2021-02-03T20:30:33+05:30
గోధమ పిండి, బియ్యప్పిండి - అర కప్పు చొప్పున, బెల్లం పొడి - ఒక కప్పు, నీరు - ఒక కప్పు, తెల్ల నువ్వులు - 5 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి - పావు టీస్పూను, నూనె - వేగించడానికి సరిపడా.
కావలసిన పదార్థాలు: గోధమ పిండి, బియ్యప్పిండి - అర కప్పు చొప్పున, బెల్లం పొడి - ఒక కప్పు, నీరు - ఒక కప్పు, తెల్ల నువ్వులు - 5 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి - పావు టీస్పూను, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో బెల్లం కరిగించి యాలకుల పొడి వేయాలి. అందులో గోఽధమపిండి, బియ్యప్పిండి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా ముద్దగా కలపాలి. తర్వాత ఉండలు చేసుకుని ప్లాస్టిక్ పేపర్‌పై అప్పాలుగా వత్తి రెండు వైపులా నువ్వులు ఒత్తి నూనెలో దోరగా వేగించాలి.
Updated Date - 2021-02-03T20:30:33+05:30 IST