స్ట్రాబెర్రీ లెమనేడ్
ABN, First Publish Date - 2021-03-20T17:50:41+05:30
బయట ఎండలు మండిపోతున్నాయి. నీళ్లు తాగినా కూడా వేసవిలో దాహం తీరదు. అందుకే చల్ల చల్లని స్ట్రాబెర్రీ లెమనేడ్ తాగితే దప్పిక తీరడమే కాదు ఆరోగ్యానికి మంచి చేస్తుంది.
బయట ఎండలు మండిపోతున్నాయి. నీళ్లు తాగినా కూడా వేసవిలో దాహం తీరదు. అందుకే చల్ల చల్లని స్ట్రాబెర్రీ లెమనేడ్ తాగితే దప్పిక తీరడమే కాదు ఆరోగ్యానికి మంచి చేస్తుంది.
కావలసినవి: తాజా స్ట్రాబెర్రీలు - కప్పు, తేనె - పావు కప్పు, నిమ్మరసం - సగం కప్పు, నీళ్లు - రెండు కప్పులు, ఐస్‌ముక్కలు నాలుగైదు, అలంకరణ కోసం స్ట్రాబెరీ ముక్కలు, పుదీనా ఆకులు.
తయారీ విధానం: మిక్సీలో స్ట్రాబెర్రీలు, తేనె వేసి మెత్తని పేస్ట్ తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గ్లాసులో స్ట్రాబెర్రీ పేస్ట్, నిమ్మరసం, నీళ్లు పోసి బాగా కలపాలి. చల్లదనం కోసం ఐస్‌ముక్కలు వేయాలి. స్ట్రాబెర్రీ ముక్కలు, పుదీనా వేసి అలంకరించి సర్వ్ చేయాలి.
Updated Date - 2021-03-20T17:50:41+05:30 IST